Published On:

Telangana: మంత్రి శ్రీధర్‌బాబుతో బీజేపీ ఎంపీ ఈటల కీలక భేటీ.. చర్చించిన అంశాలివే!

Telangana: మంత్రి శ్రీధర్‌బాబుతో బీజేపీ ఎంపీ ఈటల కీలక భేటీ.. చర్చించిన అంశాలివే!

BJP MP Etela Rajender Meets Minister Sridhar Babu: తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబును బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కలిశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రి శ్రీధర్‌బాబుతో సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రధానంగా తాగునీటి సరఫరాతో పాటు రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు.

 

అంతేకాకుండా చెరువుల్లో చెత్త పేరుకుపోయిందని, తద్వారా మురుగు బయటకు వస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది బ్లాక్ మెయిలర్లపై హైడ్రా పేరిట డబ్బులు వసూలు చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ పట్టణానికి 4వైపులా డంప్ యార్డులు ఉండాలని చెప్పారు. అలాగే చెత్తను బాలాజీనగర్ ప్రాంతానికి తరలించడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు. దీంతో పాటు డెవలప్‌మెంట్ చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో అందించాలని మంత్రిని కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు ఈటల తెలిపారు.

 

కాగా, అంతకుముందు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు 6 అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణదే కీలక పాత్ర అన్నారు. తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటేలా ప్రత్యేక పాలసీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఆగ్రో ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించి అన్నదాతలను వ్యాపారవేత్తలుగా మార్చాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.