Published On:

Amaravarti to Hyderabad: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్

Amaravarti to Hyderabad: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్

Central Government gives green signal to Amaravarti Hyderabad green field highway: తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఇప్పటివరకు పరిష్కారం కాని అంశాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కేంద్రం అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య సంబంధాలు పెంచేందుకు కేంద్రం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని ప్రతిపాదనలు పంపింది. తాజాగా, కేంద్ర హోంశాఖ సైతం డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖలకు కేంద్రం ఆదేశించింది.

 

మరోవైపు, అమరావతి రింగ్ రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ రోడ్డుకు సంబంధించి నార్త్ వైపు నుంచి జాతీయ రహదారి నిర్మాణానికి పర్మిషల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రణాళికలు రూపొందిస్తోంది.

 

ఇదిలా ఉండగా, మార్చి 3వ తేదీన కేంద్రం హోం శాఖ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఎఫ్‌సీ విభజన, షెడ్యూల్ 9లో ఉన్న కార్పొరేషన్లు, కంపెనీల వాటా, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజన, అప్పులు పంచుకోవడం, రోడ్డు, రైలు, విద్యతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ప్రతీ రెండు నెలలకోసారి సమావేశాం కావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్ లభించింది.