Rain in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం!

Heavy Rains in Hyderabad: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది. గచ్చిబౌలి, పటాన్‌చెరు, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లలన్నీ జలమయం అయ్యాయి.
ఈ క్రమంలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రాళ్ల వాన కురిసింది. దీంతో జనాలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. రాబోయే రెండు గంటల్లో నాగర్‌కర్నూలు, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో వర్షం పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.