Published On:

Liquor Shops: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి వైన్స్ షాప్స్ బంద్

Liquor Shops: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి వైన్స్ షాప్స్ బంద్

Wine Shops will Closed Saturday Due to Hanuman Jayanthi: మందుబాబులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 12న హైదరాబాద్ నగర వ్యాప్తంగా వైన్స్ బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగాహైదరాబాద్‌, సికింద్రాబాద్ నగరవ్యాప్తంగా శనివారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 13న ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

 

అయితే మద్యం దుకాణాలతో పాటు బార్లు, కల్లు దుకాణాలు సైతం మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా, స్టార్ హోటళ్లలో బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రం మినహాయింపు ఉంటుందని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

 

ఒకవేళ ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కొంతమంది వైన్స్ దుకాణాల్లో షటర్స్ మూసివేసినట్లుగా చేసి దొంగ చాటుగా మందు అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. ఇలా చేస్తున్నట్లు సమాచారం అందితే ఆ వైన్స్ షాపు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఎలాంటి మతపరమైన ఘర్షణలు చోటుచేసుకుండా ముందస్తుగా వైన్స్ దుకాణాలు మూసివేస్తున్నట్లు తెలిపారు.