Last Updated:

Janasena Pawan Kalyan : విశాఖ కేజీహెచ్ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలంటూ

ఓ కంట కన్నీరు దిగమింగుకుంటూ.. నవ మాసాలు మోసి కన్న బిడ్డని కడసారి ఒడికి అదిమి పట్టుకొని వెళ్తున్న ఈ అమ్మను చూస్తుంటే కడుపు తరుక్కు పోక మానదు. ఈ విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

Janasena Pawan Kalyan : విశాఖ కేజీహెచ్ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలంటూ

Janasena Pawan Kalyan : ఓ కంట కన్నీరు దిగమింగుకుంటూ.. నవ మాసాలు మోసి కన్న బిడ్డని కడసారి ఒడికి అదిమి పట్టుకొని వెళ్తున్న ఈ అమ్మను చూస్తుంటే కడుపు తరుక్కు పోక మానదు. ఈ విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రాంతం ముంచింగుపుట్టు మండలం కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతులకు ఓ బిడ్డ జన్మించాడు. అయితే ఆ బిడ్డ మరణించడంతో.. శిశువు దేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు అంబులెన్స్ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడంతో.. ఆ బిడ్డ తల్లితండ్రులు పుట్టెడు శోకాన్ని దిగమింగుకొని బైక్ పై 120 కి.మీ తీసుకువెళ్లారు. ఈ దారుణ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

విశాఖపట్నం కెజిహెచ్ లో 120 కి.మీ. చిన్నపాటి ద్విచక్ర వాహనం మీద మృతదేహాన్ని తీసుకువెళ్లడం తీవ్ర ఆవేదన కలిగించిందంటూ పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతాలో ” బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలి. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వం.. అని రాసుకొచ్చారు. అందుకు ఓ వీడియోని కూడా జత చేశారు. ఆ దంపతుల వేదన విన్న ఎవరికైనా గుండె కరుగుతుంది. పాషాణ ప్రభుత్వంలో మాత్రం స్పందన ఉండదు.

సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి.. పవన్ కళ్యాణ్(Janasena Pawan Kalyan)

కేజీహెచ్ లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయం. ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలి.’’ అంటూ పవన్ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదు. కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదంటూ పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారు. ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైంది? మహాప్రస్థానం వాహనాలే కాదు, అంబులెన్సుల నిర్వహణ కూడా సక్రమంగా ఉండటం లేదు. బెంజి సర్కిల్లో అంబులెన్సులు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే ప్రయోజనం ఉండదు.

వైద్య ఆరోగ్య శాఖకు రూ.14 వేల కోట్ల బడ్జెట్ ఇచ్చామని చెబితే సరిపోదు. ప్రజలకు సేవలు అందాలి. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే- విశాఖలో రాజధాని అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు’’ అంటూ పవన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ దారుణ ఘటన గూర్చి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/