Gold and silver prices: దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు
గత కొంతకాలంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలు శుక్రవారం దిగి వచ్చాయి. మరో వైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. దాదాపు 58 వేలకు వెళ్లిన బంగారం ధర ఇపుడు 56 వేల దిగువకు వచ్చింది.
Gold and silver prices: గత కొంతకాలంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలు శుక్రవారం దిగి వచ్చాయి. మరో వైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. దాదాపు 58 వేలకు వెళ్లిన బంగారం ధర ఇపుడు 56 వేల దిగువకు వచ్చింది. గడిచిన మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి లో బంగారం ధర రూ. 1500 లు మేర తగ్గింది.
శుక్రవారం 10 గ్రాముల బంగారంపై రూ. 430 లు తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం రూ. 400(10 గ్రాములపై) తగ్గి 52 వేలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ. 430 తగ్గి 56 వేల 730 కు చేరింది.
మరో వైపు వెండిధర కిలోపై రూ. 950 తగ్గి రూ. 71 వేల80 కు చేరింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో శుక్రవారం తేడాలు కనిపించాయి.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు(Gold and silver prices)
హైదారాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర( 10 గ్రాములు) రూ. 52 వేలు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,150 కాగా 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,880
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52 వేలు, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,730
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 52,800, 24 క్యారెట్ల ధర రూ. 57,600
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 52,050, 24 క్యారెట్ల ధర రూ. 56,780
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 52,000, 24 క్యారెట్ల ధర రూ. 56,730
వైజాగ్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52 వేలు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730
వెండి ధరలు (కిలో)
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు మాత్రం బాగా తగ్గాయి. గురువారం కిలో వెండి ధర రూ. 69,950 గా ఉండగా.. రూ. 950 తగ్గి 69,000 వేలకు చేరింది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,800
విజయవాడలో – రూ. 71,800
విశాఖపట్నంలో – రూ. 71,800
బెంగళూరులో- రూ. 71,800
చెన్నైలో – రూ. 71,800
ఢిల్లీలో- రూ. 69,000
ముంబైలో- రూ. 69,000