Published On:

Hari Hara Veeramallu: కింగ్డమ్ రిలీజ్ డేట్ పై కన్నేసిన వీరమల్లు.. ?

Hari Hara Veeramallu: కింగ్డమ్ రిలీజ్ డేట్ పై కన్నేసిన వీరమల్లు.. ?

Hari Hara Veeramallu:  హరిహర వీరమల్లు.. అదుగో ఆరోజు వస్తుంది. ఇదిగో ఈరోజు వస్తుంది. లేదు లేదు సంక్రాంతికి వస్తుంది. అబ్బే కాదు కాదు సమ్మర్ కి వస్తుంది. ఇలా మాట్లాడుకోవడమే కానీ.. అది వచ్చేది మాత్రం లేదు. ఎన్నేళ్ల నుంచి ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.. మొదటిసారి పవన్.. పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు అనగానే.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

 

ఇక ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఇక ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూడటమే తప్ప రిలీజ్ కు మాత్రం నోచుకున్నది లేదు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు చాలా మారాయి. పవన్ కి పదవి వచ్చింది. డైరెక్టర్ మారాడు. షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఇలా ఒకటి అని చెప్పడానికి లేదు. వరుసగా సినిమా వాయిదా పడుతూనే వస్తుంది.

 

చివరకు మే 9 న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా చెప్పారు. మే కూడా వచ్చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక క్లారిటీ లేదు. ఉన్నాకొద్దీ ఈ సినిమాపై అంచనాలు తగ్గి.. అసహనం పెరుగుతుంది. ఇంకోపక్క బయ్యర్లు కూడా కొనడానికి భయపడుతున్నారు. ఈలోపు సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ లాంటి ప్రమోషన్ కంటెంట్ ఏదైనా బయటకు వదిలితే.. కనీసం దాని గురించి మాట్లాడుతూ హైప్ అయినా క్రియేట్ అవుతుంది అనుకుంటే అది చేయడం లేదు.

 

అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అన్న నమ్మకం కూడా పోయింది. ఎలాగో వీరమల్లు రావడం లేదని.. ఆ డేట్ ను సింగిల్, శుభం సినిమాలు లాగేసుకున్నాయి. అయితే తాజాగా వీరమల్లు నిర్మాత.. మే 30 న రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఇంకా ఈ సినిమా కోసం పవన్ ఒక నాలుగురోజులు షూటింగ్ చేయాల్సింది ఉందట. దాన్ని ఫినిష్ చేసి మే 30 న రిలీజ్ చేస్తే కనుక.. ఆ రోజున రిలీజ్ అవుతున్న కింగ్డమ్ వాయిదా పడుతుంది అని చెప్పుకొస్తున్నారు. కింగ్డమ్.. నాగవంశీ నిర్మిస్తున్నాడు కనుక.. త్రివిక్రమ్ చెప్తే డేట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు పవన్ కోసం త్రివిక్రమ్ చర్చలు జరిపి.. కింగ్డమ్ డేట్ ను లాక్ చేస్తారేమో చూడాలి.