Home / latest political news
YS Sharmila: తెరాస ప్రభుత్వంపై మరోసారి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తనతో తనతో కలిసి పాదయాత్ర చేయాలంటూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపారు. ప్రభుత్వం కావాలనే తన పాదయాత్రను అడ్డుకుంటోందని ఈ సందర్భంగా షర్మిల ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Rahul Gandhi: దేశంలోని ప్రజా సమస్యలను వినడం.. ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ముగింపు సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఎమోషనల్ అయ్యారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ను రద్దు చేసి వస్తే.. ముందుస్తు ఎన్నికలకు మేము కూడా రెడీ అని తెలిపారు.
ఈరోజు పాదయాత్రను ప్రారంభించిన టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ను ఉద్దేశస్తూ... 'ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు' అని ఎద్దేవా చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ జన సందోహం మధ్య పవన్ కళ్యాణ్ కొండగట్టుకి చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని ముందే తెలియడంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహి ఏపీలో దూసుకుపోవడానికి సిద్ధమైంది. తాజాగా ఛలో కొండగట్టుకు సంబంధించిన ప్రోమోను జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.
ఈ నెల 24న జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనానికి సంప్రదాయ పూజలు చేయించనున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెదేపా పోలిట్ బ్యూరో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.
జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలని స్పీకర్‌ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరడంతో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.