Elon Musk: మస్క్ ఛార్జీల మోత మళ్లీ షురూ.. ఈనెల 29 నుంచి బ్లూటిక్ సేవలు పునరుద్ధరణ
మస్క్ మామ ఛార్జీలు మరల షురూ చేశాడు. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ను సర్వీసులను మరల పునరుద్ధరించనున్నాడు. ఈ నెల 29 నుంచి బ్లూటిక్ ను మెయింటేన్ చేయాలన్నా లేదా కొత్త ఎకౌంట్ తీసుకోవాలన్నా డబ్బు చెల్లించాల్సిందే.
Elon Musk: మస్క్ మామ ఛార్జీలు మరల షురూ చేశాడు. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ను సర్వీసులను మరల పునరుద్ధరించనున్నాడు. ఈ నెల 29 నుంచి బ్లూటిక్ ను మెయింటేన్ చేయాలన్నా లేదా కొత్త ఎకౌంట్ తీసుకోవాలన్నా డబ్బు చెల్లించాల్సిందే.
Punting relaunch of Blue Verified to November 29th to make sure that it is rock solid
— Elon Musk (@elonmusk) November 15, 2022
ట్విటర్ బ్లూ టిక్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. బ్లూటిక్ ను మెయింటేన్ చేయాలంటే తప్పనిసరిగా నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దీనినే అదునుగా చేసుకున్న కొందరు హ్యాకర్లు ఫేక్ అకౌంట్లు సృష్టించారు. దానితో నకిలీ వాటికి కూడా బ్లూటిక్ ఉండడం వల్ల ఎవరు అఫీషల్ అనేది తేల్చలేక ట్విట్టర్లో గందరగోళం నెలకొంది.
8 డాలర్లు హ్యాకర్లు సైతం వివిధ కంపెనీలు వ్యక్తుల పేర్లతో ప్రీమియం సబ్ స్క్రిప్షన్ పొందారు. దానితో అసలైన యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నకిలీ ఖాతాలు పెరిగిపోయాయని భావించిన మస్క్
వెంటనే బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ కొద్దిరోజుల పాటు నిలిపివేశారు. కాగా తాజాగా ఫేక్ అకౌంట్ల లెక్క తేల్చిన మస్క్ వెంటనే ఓ ప్రకటన చేశాడు. ట్విటర్ బ్లూటిక్ పెయిడ్ ఫీచర్‌ను రీస్టార్ట్ చేస్తున్నట్టు వెల్లడించాడు. ఇదే విషయాన్ని ట్వీట్ చేశాడు. ఈ నెల 29వ తేదీ నుంచి బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్‌ను మళ్లీ ప్రారంభిస్తామని చెప్పాడు. “బ్లూటిక్ పెయిడ్ ఫీచర్ మళ్లీ ఎప్పుడు మొదలు పెడతారు” అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు “వచ్చే వారంలోగా” అని సమాధానమిచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ప్రకటన చేయడంతో యూజర్లు మస్క్ మరల ఏఏ నిర్ణయాలతో వినియోగదారుల ముందుకు వస్తాడో అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: ఆ దగ్గు మందు మరణాలు సిగ్గుచేటు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు