Canada: కెనడా బీచ్‌లో ఆప్ నేత కూతురు మృతదేహం లభ్యం

AAP Leader Daughter Suspicious Died in Canada: కెనడాలో గత 4 రోజులు మిస్సింగ్ అయిన భారతీయ విద్యార్థిని శవమై తేలింది. ఓట్టావాలోని కాలేజీకి సమీపంలో ఉన్న బీచ్ వద్ద మృతదేహం లభ్యమైందని భారత హైకమిషన్ తెలిపింది. కాగా, 21 ఏళ్ల విద్యార్థిని వంశిక నాలుగు రోజుల క్రితమే అదృశ్యమై.. అనుమానాస్పదంగా శవమై కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని డేరా బస్తీకి చెందిన ఆప్ నాయకుడు, ఎమ్మెల్యే కుల్జీత్ సింగ్ రాంధావా సన్నిహితుడు దేవిందర్ సింగ్ కుమార్తె ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. నాలుగు రోజుల క్రితం రూం వెతికే క్రమంలో బయటకు వెళ్లని ఆమె తిరిగి రాలేదు. నిత్యం ఇంటికి ఫోన్ చేసి మాట్లాడే వంశిక పోన్ చేయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెకు ఫోన్ చేశారు. అయితే ఫోన్ స్విచ్ ఆప్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇందులో భాగంగానే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కాలేజీకి సమీపంలో ఉన్న బీచ్ వద్ద ఆమె మృతదేహం దొరకడంతో భారత్ హైకమిషన్‌కు సమాచారం అందించారు. కాగా, విద్యార్థి మృతికి గల కారణాలు తెలియారాలేదు.
ఇదిలా ఉండగా, ఇటీవల కెనడాలో కాల్పుల్లో ఓ విద్యార్థిని రంధావా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె బస్టాప్ వద్ద నిల్చుండగా.. ఓ దుండగుడు కాల్పులు జరపడంతో మృతి చెందింది. ఈ ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో ఆందోళన నెలకొంది.