RRB on assistant Loco Pilot: నిరుద్యోగులకు రైల్వే గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు!

RRB Extends Assistant Loco Pilot Application Date till May 19th: నిరుద్యోగులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేలో ఖాళీగా ఉన్న 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల నియామకానికి దరఖాస్తు గడువు పొడింగించింది. కాగా ఈ పోస్టులకు అప్లై చేసేందుకు మే 11 అంటే ఇవాళ్టితో ముగియనుంది. తాజాగా ఆ గడువును మే 19 వరకు పొడిగించారు. దీంతో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు rrbapply.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు మే 21 వరకు అవకాశం కల్పించారు. మొత్తం 9970 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టుల్లో జోన్లవారీగా ఉన్న పోస్టుల వివరాలు..
* తూర్పు రైల్వే- 868
* దక్షిణ రైల్వే- 510
* పశ్చిమ రైల్వే- 885
* ఆగ్నేయ రైల్వే- 921
* ఉత్తర రైల్వే- 521
* నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే- 125
* తూర్పు మధ్య రైల్వే- 700
* ఉత్తర మధ్య రైల్వే- 508
* దక్షిణ మధ్య రైల్వే- 989
* ఈశాన్య రైల్వే- 100
* వాయువ్య రైల్వే- 679
* కోల్ కతా మెట్రో రైల్వే- 225
అర్హులైన అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికేట్ తో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంజనీరింగ్ లో మూడు ఏళ్ల డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అభ్యర్థులు 2025 జూలై 1 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. జనరల్, ఓబీసీ వారు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులు రూ. 250 చెల్లించాలి.
రాతపరీక్ష ఆన్ లైన్ రెండు లెవల్స్ లో నిర్వహిస్తారు. వీటితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆన్ లైన్ పరీక్ష లెవల్ 1 లో 75 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 60 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇక లెవల్ 2 లో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్ ఏలో 100 ప్రశ్నలను 90 నిమిషాల్లో, పార్ట్ బీలో 75 ప్రశ్నలను 60 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. తప్పు సమాధానానికి నెగటివ్ మార్కులు ఉంటాయి.