Gold Rates All Time Record: హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రూ.లక్ష దాటిన బంగారం.. 10గ్రా. బంగారం ధర ఎంతంటే?

Gold Rates Touches One Lakh Rupees per Ten Grams: పసిడి ప్రియులకు మరో షాకింగ్ వార్త. ఇవాళ బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై ఒక్కరోజే ఏకంగా రూ.2,750 పెరిగింది. దీంతో హిస్టరీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైమ్ రూ.లక్ష దాటింది.
ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 1649 పెరగడంతో రూ.1,02,160 పలుకుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.2,750 పెరగడంతో రూ.92వేలకు చేరింది. అలాగే కిలో వెండి ధర రూ.1,11,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరోవైపు, రిటైల్ మార్కెట్‌లోనూ బంగారం రికార్డు ధర పలుకుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,02,000గా ఉంది. లైవ్ మార్కెట్‌లో బంగారం ధర రూ.1,02,060గా పలుకుతోంది. అలాగే ఎంసీఎక్స్‌లో కూడా పసిడి ధరలు దూకుడు కొనసాగిస్తున్నాయి. ఇవాళ్టి ట్రేండింగ్‌లో బంగారం ధర రూ.1,600కిపైగా పెరిగింది.
ఇదిలా ఉండగా, అమెరికా పరిణామాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుతో ఏకంగా ఔన్స్ బంగారం 3,490 డాలర్లు దాటింది. బంగారం పరుగుకు డాలర్ బలహీనత దారితీస్తుంది. మూడేళ్ల కనిష్ఠానికి డాలర్ ఇండెక్స్ పడిపోయింది. ఫెడ్ నిర్ణయాలపై ట్రంప్ జోక్యంతో ఇన్వెస్టర్లకు భయాలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.