Pope Leo XIV Speech: 14వ పోప్‌గా రాబర్ట్ ప్రివోస్ట్.. తొలి ప్రార్థన ఏ చర్చిలో చేశారంటే?

Pope Leo XIV Robert Prevost first speech in Vatican City: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఘడియ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అందరికీ ఆరాధ్యుడైన పోప్ ఎన్నిక పూర్తయింది. అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ ను 14వ పోప్ లియోగా ఎన్నుకున్నట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. అమెరికన్ పోప్‌గా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సంప్రదాయం ప్రకారం.. పోప్ లియో సెయింట్ పీటర్స్ కూడలిలోని బాల్కనీ నుంచి తన దీవెనలందించారు.అనంతరం శాంతి మీ అందరినీ వెన్నంటి ఉండుగాక అని ఆయన ఆశీర్వదించారు.
ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఆయన అమెరికన్ తొలి పోప్‌గా ప్రత్యేకతను చాటుతున్నారు. ఈ మేరకు ఆయన వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్ చర్చిలో తొలిసారిగా సామూహిక ప్రార్థనా కార్యక్రమానికి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది మత గురువులు పాల్గొన్నారు. ఈ పోగ్రాంకు వచ్చిన అందరినీ ఆశీర్వదిస్తూ ప్రార్థనా వేదిక వద్దకు వెళ్లారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
శిలువను మూసేందుకు ఈ వేదికపైకి నన్ను నిలబెట్టారని, దీని ద్వారా ఆశీర్వాదం పొందేందుకు పంపించారన్నారు. ఈ ప్రయాణంలో చర్చినే వ్యవస్థ, సమాజం, క్రీస్తు మిత్రులు, నమ్మకస్తులుగా మీరంతా నా వెంట వస్తారని తెలుసని పేర్కొన్నారు. కాగా, ఆయన అమెరికాలోని షికాగోకు చెందిన క్యాథలిక్కుల అత్యున్నత గురువు అని, ఆయనను పోప్‌గా ఎన్నుకున్న తర్వాత తన పేరును లియో 14గా మార్చుకున్నారు.
ఇదిలా ఉండగా, పోప్ లియో 14గా నియామకమైన ఆయన ఈనెల 18న లాంఛనంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వాటికన్ సిటీ పేర్కొంది. అనంతరం ఆయన ఈ నెల 21న ప్రజా దర్శనానికి అందుబాటులో ఉండనున్నారు.