Supreme Court: ద్వేషపూరిత ప్రసంగాలు సరికాదు.. సుప్రీంకోర్టు
ఇతరుల మనోభావాలును దెబ్బతీసేలా ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అలాంటివి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
New Delhi: ఇతరుల మనోభావాలును దెబ్బతీసేలా ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అలాంటివి చేసే వారి పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
దేశంలో ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేస్తున్న పలు అంశాల పై సర్వోత్తమ న్యాయస్ధానంలో పిటిషన్లు దాఖలైనాయి. ఈ క్రమంలో సుప్రీం కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. దేశంలో ద్వేషపూరిత వాతావరణం నెలకొంది. కొన్ని అంశాల్లో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రసంగాలను సహించలేం. 21వ శతాబ్దంలో ఏం జరుగుతోంది? మతం పేరుతో ఎక్కడికి చేరుకుంటున్నాం? అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: Supreme Court: టపాసులు పేల్చేందుకు ఢిల్లీవాసులకు నో.. స్వీట్లు కొనుక్కోమన్న సుప్రీం కోర్టు