Motorola Edge 60: దుంపతెగ ఇదేం ఫోన్ రా.. మోటో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ లీక్..!

Motorola Edge 60: మోటరోలా తన రెండు కొత్త ఫోన్‌లను మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 స్టైలస్‌లను కొన్ని రోజుల క్రితం భారతదేశంలో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మోటరోలా ఎడ్జ్ 60. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 24న లాంచ్ చేయవచ్చు. అదే కార్యక్రమంలో కంపెనీ రేజర్ 60 సిరీస్, ఎడ్జ్ 60 ప్రోలను కూడా ప్రారంభించవచ్చు. లాంచ్‌కు ముందు రాబోయే ఎడ్జ్ 60 ఫోటోలు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం.. ఫోన్‌లో 24జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Motorola Edge 60 Features
లీకైన సమాచారం ప్రకారం.. కంపెనీ ఫోన్‌లో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇవ్వగలదు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 12జీవీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో రావచ్చు. ప్రత్యేకత ఏమిటంటే కంపెనీ ఫోన్‌లో 12 GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అందించగలదు. దీనితో ఫోన్ ర్యామ్ మొత్తం 24జీవీ వరకు పెరుగుతుంది.
Motorola Edge 60 Camera
ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ మీకు LED ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ లైటియా 700C మెయిన్ లెన్స్‌ను అందించగలదు. ఈ కెమెరా OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా, మీరు ఫోన్‌లో అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 3x టెలిఫోటో లెన్స్‌ను పొందచ్చు. అదే సమయంలో సెల్ఫీ కోసం ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Motorola Edge 60 Battery
ఫోన్ బ్యాకప్ కోసం 5200mAh బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 68W టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ మిలిటరీ-గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, అంటే MIL-STD-810H సర్టిఫికేషన్ పొందింది. ఇది కాకుండా, కంపెనీ IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కూడా అందించగలదు. లీక్ అయిన ఫోన్ ధర గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ధర కోసం మీరు లాంచ్ వరకు వేచి ఉండాలి.
ఇవి కూడా చదవండి:
- OnePlus 13T: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు పండగే.. ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌తో వన్‌ప్లస్ వచ్చేస్తోందోచ్.. ఇవిగో ఫుల్ డీటెయిల్స్..!