Supreme Court Notice to Central Govt.: వక్ఫ్ బోర్డు చట్టం.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు!

Supreme Court notices to Central government for Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టం 2025 ను సవాల్ చేస్తూ దాఖలౌన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా టీం విచారణ చేసింది. అనంతరం కేంద్రంపై పలు ప్రశ్నలు వేసింది. వక్ఫ్ చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. అలాగే ఈ విషయంలో హింసాత్మక ఘటనలు మిమ్మల్ని బాధించాయని పేర్కొంది. వక్ఫ్ చట్టం 2025పై సుప్రీంకోర్టులో చేసిన విచారణలో ఈ బిల్లుపై 38 సమావేశాలు నిర్వహించిందని, 98.2 లక్షల సూచనలు పరిశీలించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.
ఈ మేరకు వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇందులో భాగంగానే వక్ఫ్ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. చట్టంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు వివరించింది. 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కలెక్టరకు అధికారాలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు వివరించింది. అనంతరం తదుపరి విచారణకు రేపటికి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి:
- Supreme Court Serous on TG Govt.: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం – తెలంగాణ సర్కార్ పై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు