టాలీవుడ్ లో ఏ కాన్సెప్ట్ హిట్ అవుతుందో.. మిగతావారందరూ అదే కాన్సెప్ట్ పైనే పడతారు
అఖండ తరువాత అన్ని డివోషనల్ కథలే నడిచాయి. ఇక ఈ మధ్యకాలంలో అందరూ పోలీస్ కథలపై పడుతున్నారు
సీనియర్ హీరోలు చక్కగా ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటుంటే కుర్ర హీరోలు మాత్రం రూత్ లెస్ కాప్ కావాలని కోరుకుంటున్నారు
ఇండస్ట్రీలో కుర్ర హీరోలంతా కాప్ కథలతోనే వస్తున్నారు. వారెవరో చూద్దాం
హిట్ 3- నాని.
ఇప్పటివరకు క్లాస్ హీరోగా ఉన్న నాని.. ఈ సినిమాలో రూత్ లెస్ కాప్ గా కనిపించబోతున్నాడు
స్పిరిట్- ప్రభాస్.
మొట్టమొదటిసారి డార్లింగ్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు
మాస్ జాతర- రవితేజ.
మాస్ మహారాజాకు ఖాకీకి విడదీయరాని అనుబంధం ఉందని చెప్పొచ్చు
కింగ్ డమ్- విజయ్ దేవరకొండ.
వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న రౌడీ హీరో మొదటిసారి కాప్ గా కనిపించబోతున్నాడు
విశ్వక్ సేన్ కూడా ఒక పోలీస్ కథను అనౌన్స్ చేశాడు. మరి ఈ కాప్స్ లో ఏ కాప్ హిట్ అందుకుంటాడో చూడాలి.