KL Rahul vs Sanjiv Goenka IPL 2025: మామూలు రివేంజ్ కాదు.. క్లాస్ ఇచ్చిన సంజీవ్ గోయెంకాని రాహుల్ ఏం చేశాడంటే?

KL Rahul Ignores lsg owner Sanjiv Goenka In IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 40వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. లక్నో విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇందులో రాహుల్(57) పరుగులతో సత్తా చాటాడు.
అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం రాహుల్.. ఇతర ఆటగాళ్లకు కరచాలనం చేస్తుండగా.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా,అతని కుమారుడు శశ్వాంత్ గోయెంకా ఎదురుపడ్డారు. ఈ సమయంలో వారిద్దరికి కేఎల్ రాహుల్ షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకెళ్లాడు. అయితే లక్నో ఓనర్ సంజీవ్ మాత్రం రాహుల్‌ను అక్కడే ఆపి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ రాహుల్ ఆయనను పట్టించుకోకుండా శశ్వాంత్‌కు వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకుసాగాడు. ఈ విధంగా ఇద్దరితో మాట్లాడేందుకు రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు.
కాగా, సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. కొంతమంది ఏకంగా ఇది కదా రివేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది గతేడాది లక్నో తరఫున రాహుల్ ఆడగా.. సంజీవ్ మైదానంలో తీవ్ర విమర్శలు చేసిన మాటలను గుర్తుచేస్తున్నారు.
Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic
— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025