Home / Supreme Court
Big Shock To Sajjala Bhargav Reddy: వైసీపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి మరోసారి ఎదురు దెబ్బ తలిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక మొదలైంది. ఇన్నాళ్లు సైలెంట్ అయిన ఈ కేసులపై సుప్రీంకోర్టు ఫోకస్ చేసింది. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలను రెండు వారాల్లో అందించాలని ఆదేశించింది. […]
Supreme Court has ordered the CBI and ED about Jagan Assets Case: ఏపీ మాజీ సీఎం జగన్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని పేర్కొంది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ దరఖాస్తుల వివరాలు అందించాలని చెప్పింది. అయితే, సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా […]
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్‌లను రాష్ట్రపతి నియమించారు. వీరి నియామకంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 కు చేరింది.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ విద్యుత్ విచారణ కమీషన్హ పై మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నర్సింహారెడ్డి స్థానంలో కొత్త వారిని ఛైర్మన్‌గా నియమించాలని ఆదేశించింది.
లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుండి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. విడాకుల తర్వాత తన భార్యకు భరణం చెల్లించాలనే ఆదేశాలను సవాలు చేస్తూ ఒక ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చి ఈ తీర్పును వెలువరించింది.
నీట్ పేపర్ లీక్ ఘటనలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరుపుతోందని, దీనికి సంబంధించి పలు అరెస్టులు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తన అఫిడవిట్లో తెలిపింది.
నీట్ పరీక్షల వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా సహించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నాడు కేంద్రప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు పంపించింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం గ్రేస్ మార్కులు ఇచ్చిన 1,563 NEET-UG 2024 అభ్యర్థుల స్కోర్‌కార్డ్‌లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. NEET ఫలితాలపై సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా ఎన్ టీ ఏ ఈ విషయాన్ని తెలియజేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కటకట తీవ్రంగా ఉంది. రాజధాని ప్రజలను మంచి నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. అదే సమయంలో ట్యాంకర్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి.