Published On:

Pahalgam Terror Attack : పహల్గాం దాడిలో ఇద్దరు పాకిస్తానీలు!

Pahalgam Terror Attack : పహల్గాం దాడిలో ఇద్దరు పాకిస్తానీలు!

 

Pahalgam : పహల్గాం దాడిలో ఇద్దరు పాకిస్తానీలు మరో ఇద్దరు లోకల్ తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. దాడి సమయంలో నలుగురు ఉగ్రవాదులు AK – 47తో కాల్పులు జరిపారు. వారిలో ఇద్దరు పష్తూన్ భాషలో మాట్లాడారు. మిగిలిన ఇద్దరిని ఆదిల్, ఆసిఫ్ గా గుర్తించారు. వీరు బిజ్ బెరా, ట్రాల్ కు చెందినవారు. వీరు బాడీ కెమెరాలను ధరించి మొత్తం సంఘటనను రికార్డు చేశారు. NIA ఇప్పటికే స్టేట్ మెంట్స్ ను రికార్డు చేసింది. ఫొరెస్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి బెల్లెట్ షెల్స్ ఇతర నమూనాలను సేకరిస్తోంది.

 

మంగళవారం మధ్యాహ్నం జరిగిన దాడిలో 26మంది టూరిస్టులు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రదాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టిఆర్‌ఎఫ్) బాధ్యత వహించింది. ఈ సంస్థను సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్ నెలకొల్పాడు. గతంలో సజ్జాద్ లష్కరే తయ్యిబా కమాండర్ గా పని చేశాడు. ఇతను 2018 జూన్ 14న ప్రముఖ జర్నలిస్టు షుజాత్ బుఖారీని హతమార్చడాని కుట్రపన్నాడు.

 

మంగళవారం రాత్రి శ్రీనగర్ కు చేరుకున్న హోం మంత్రి అమిత్ షా భద్రతా బలగాలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.  ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి బుధవారం ఉదయం నివాళులు అర్పించారు. ప్రత్యేక విమానాలలో మృతదేహాలను స్వస్థలాలకు పంపించనున్నారు. ఉగ్రవాదులకోసం వేట కొనసాగుతోంది. డ్రోన్ ల సహాయంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.

 

సౌదీఅరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దాడిచేసిన వారెవరిని వదిలిపెట్టబోమన్నారు. విమానాశ్రయంలో మోదీని కలిసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పరిస్థితిని వివరించారు.