Published On:

Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Encounter in Baramulla’s Uri: జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బారాముల్లాలోని ఉరి ప్రాంతంలో బుధవారం కొంతమంది ఉగ్రవాదులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారు. ఈ సమయంలో గుర్తించిన భారత్ సైన్యం కాల్పులు జరిపింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

 

వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లోని ఉరి సెక్టార్ వద్ద సర్జీవన ప్రాంతం నుంచి దేశంలోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. వెంటనే భారత్ బలగాలు ఆపరేషన్ చేపట్టి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ వెల్లడించింది. అనంతరం ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

 

ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో మినీ స్విట్జర్లాండ్‌లోని ఓ పర్యాటక ప్రాంతంలో కొంతమంది ఆర్మీదుస్తుల్లో వచ్చి పర్యటకులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ దాడిని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఖండించారు.