OPPO K13 5G Launch Tomarrow: దీన్ని కొట్టేది లేదు.. రేపే ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. దీని ముందు ఏ ఫోను పనికిరాదు..!

OPPO K13 5G Launch Tomarrow: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే. మీరు Oppo K13 కోసం కాస్త వెయిట్ చేయండి. ఒప్పో దీనిని రేపు (అంటే ఏప్రిల్ 21) భారతదేశంలో విడుదల చేయనుంది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా టీజ్ చేసింది. ఒప్పో ఫోన్ మైక్రోసైట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ చేసింది, అక్కడ కంపెనీ ఫోన్ ఫీచర్లను వెల్లడించింది. రాబోయే ఫోన్‌లో ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
ఈ ఫోన్ ఏప్రిల్ 21న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఒప్పో ఇండియా అధికారిక సైట్ కాకుండా, దీనిని ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రిజం బ్లాక్, ఐసీ పర్పుల్ రంగులలో అందుబాటులో ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. అధికారిక లాంచ్ తర్వాత ఖచ్చితమైన ధర తెలుస్తుంది కానీ ఇది రూ. 20,000 కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఇది మొదట భారతదేశంలో, తరువాత ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
OPPO K13 5G Display
ఫోన్‌లో 6.66-అంగుళాల ఫుల్ HD ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కళ్ళను రక్షించడానికి ఫోన్‌లో లో బ్లూ లైటింగ్ ఫీచర్‌ను ఉంటుంది. దీనికి అండర్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
OPPO K12x 5G Processor
మల్టీ టాస్కింగ్ మరియు సున్నితమైన పనితీరు కోసం, ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. దాని AnTuTu స్కోరు 7.9 లక్షల కంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ చిప్‌సెట్ అడ్రినో A810 GPU తో జతచేసి ఉంటుంది.
OPPO K12x 5G Battery
ఈ ఫోన్ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 5 సంవత్సరాల మన్నికైన గ్రాఫైట్ బ్యాటరీ అని కంపెనీ పేర్కొంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఇది 49.4 గంటల కాలింగ్, 10.3 గంటల గేమింగ్, 32.7 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఫోన్‌తో వచ్చే 80W SuperVOOC ఛార్జర్ 30 నిమిషాల్లో 62 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
OPPO K12x 5G Camera
ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-క్లియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఈ కెమెరా AI క్లారిటీ ఎన్‌హాన్సర్, AI అన్‌బ్లర్, AI రిఫ్లెక్షన్ రిమూవర్, AI ఎరేజర్ వంటి AI ఫీచర్లకు సపోర్ట్ ఇస్తుంది.
ఇవి కూడా చదవండి:
- This Week Launching Mobiles: ఈ వారంలో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్.. ఏయే కంపెనీలు ఫోన్లు లాంచ్ చేస్తున్నాయంటే..?