Published On:

Madhuram Movie: నైంటీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ.. మూడు గెటప్స్ వేయడానికి చాలా కష్టపడ్డా: యంగ్ హీరో ఉదయ్ రాజ్

Madhuram Movie: నైంటీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ.. మూడు గెటప్స్ వేయడానికి చాలా కష్టపడ్డా: యంగ్ హీరో ఉదయ్ రాజ్

Madhuram Movie: టాలీవుడ్ పరిశ్రమకు మరో కొత్త హీరో పరిచయం అవుతున్నారు. తెలుగులో బ్లాక్ బస్టర్ ఆర్‌ఆర్ఆర్, ఆచార్య వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఉదయ్ రాజ్.. ఓ కొత్త సినిమాతో తెలుగు సినీ ప్రేమికులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ హీరోహీరోయిన్లుగా శ్రీ వేంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాజేష్ చికిలే డైరెక్షన్‌లో వస్తున్న మూవీ ‘మధురం’. ఈ సినిమాకు ఎం.బంగార్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మధురం సినిమాకు ‘ఎ మెమొరబుల్ లవ్.. ట్యాగ్ లైన్ జోడించారు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా, ఈ సినిమాపై యంగ్ హీరో ఉదయ్ రాజ్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

 

‘మెగాస్టార్ చిరంజీవి సినిమాలను నా చిన్నతనం నుంచి ఇష్టపడేవాడిని అప్పటినుంచి ఆయన సినిమాలతో పాటు ఆయన స్ఫూర్తితో నేను సినిమాలను చేయాలని బలంగా అనుకున్న. అయితే ఇటీవల ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో మాట్లాడడం మరచిపోలేనిది. గత 12ఏళ్లుగా సినిమా పరిశ్రమలో ఉంటున్నా. అన్ని డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా పనిచేశా. ఇప్పటికే చాలా సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కూడా యాక్ట్ చేశా. తాజాగా, బంగార్రాజు సపోర్టు ఇవ్వడంతో ఫస్ట్ మూవీ ‘మధురం’ సినిమాతో మీ ముందుకు వస్తున్నా. అలాగే డైరెక్టర్ రాజేష చికిలేతో చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉంది. తొలుత ఆయన స్టోరీ చెప్పగానే చాలా నచ్చింది. నైంటీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ కావడంతో పాటు 10వ తరగతి అమ్మాయి, 9వ తరగతి అబ్బాయి మధ్య నడిచే లవ్ స్టోరీ చాలా అందంగా ఉంటుంది. ఈ సినిమాలో 3 డిఫరెంట్ వేరియేషన్స్‌.. చిన్న పిల్లాడిగా, స్కూల్ స్టూడెంట్‌గా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా మూడు గెటప్స్ వేసేందుకు చాలా కష్టపడ్డాను.’

 

‘అలాగే ఈ సినిమాల చబ్బీగా కనిపించడంతో పాటు సన్నగా కావడానికి కేవలం నీటిని మాత్రమే తీసుకున్నా. నేను, డైరక్టర్ ప్రభుత్వ స్కూళ్లలోనే చదవడంతో అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ సినిమా తీశారు. 90లో ఉన్న పరిస్థితులకు తగన విధంగా తీశారు. 90లో చదివిన వారికి ఈ సినిమా చూస్తే మళ్లీ అప్పటి విషయాలు గుర్తుకొస్తాయి. పాఠశాలకు సైకిల్ మీద వెళ్లి అమ్మాయిల ముందు బిల్డప్ ఇవ్వడంతో పాటు గ్రామాలకు తగిన విధంగా వచ్చేలా చేశారు. షూటింగ్ లైవ్ లోకేషన్‌లో చేశాం.’ అని చెప్పారు.

 

‘ఇక హీరోయిన్ విషయానికొస్తే.. తెలుగు అమ్మాయిని తీసుకోవాలని బలంగా అనుకున్నాం. కానీ కుదరకపోవడంతో వైష్ణవి సింగ్‌ను తీసుకున్నారు. ఆ అమ్మాయి చాలా బాగా నటించింది. ఇందులో మధు, రామ్‌ల ప్రేమనే మధురం. ఈ సినిమాను డైరెక్టర్ చాలా బాగా తీశారు. ఎవరికైనా ఏదీ అంత సులువుగా రాదు. చాలా కష్టపడితే తప్పా. నా విషయంలో కూడా చాలా సమస్యలను దాటుకుంటూ వచ్చా. నిర్మాత బంగార్రాజు సపోర్టు ఇచ్చారు. మ్యూజిక్ వెంకీ వీణ చాలా బాగా అందించారు. టీజర్, ట్రైలర్ బాగుందని చెప్పడం ఆనందంగా ఉంది. సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.’ అన్నారు.

 

‘ఈ సినిమాలో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్, బస్ స్టాప్ ఫేం కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యు రెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్ తదితరులు నటించారు. ఇక కెమెరామెన్‌గా మనోహర్ కొల్లి,మ్యూజిక్ వెంకీ వీణ, పాటలు రాఖీ, ఎడిటర్ ఎన్టీఆర్, పిఆర్ఓగా జి కె మీడియా (గణేష్, కుమార్) పనిచేశారు. అలాగే నాకు చాలామంది సపోర్ట్‌గా నిలిచారు. విశ్వక్ సేన్ పోస్టర్ లాంచ్ చేయగా.. నితిన్ టీజర్, వివీ వినాయక్ ట్రైలర్ విడుదల చేశారు.’ అని హీరో చెప్పుకొచ్చాడు.

 

 

ఇవి కూడా చదవండి: