France Crime News: ఆస్పత్రికి వచ్చే చిన్నారులే టార్గెట్.. ఏకంగా 299మందిపై డాక్టర్ అత్యాచారం

French ex-surgeon is accused of raping or abusing 299 victims: వైద్యోనారాయణ హరి అని తెలుగులో నానుడి ఉంది. అంటే వైద్యుడు భగవంతుడితో సమానం అని అర్థం. అలాంటిది.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి చాలా క్రూరాతి క్రూరంగా వ్యవహరించాడు. డాక్టర్ అయిన తన వద్దకు వచ్చే పేషెంట్లకు వైద్యం అందించకుండా.. వారిపై అకృత్యాలకు ఒడిగట్టాడు. అలా ముప్ఫై ఏళ్ల పాటు 299 మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ డాక్టర్. ఇది ఎక్కడో మారుమూల జరిగిన వ్యవహారం కాదు. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపేస్తోంది. ఇంతకీ.. ఈ స్టోరీలో డాక్టర్ ఎలా దొరికాడు? దీని వెనక దర్యాప్తు అధికారులు ఏమంటున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం..
ఫ్రాన్స్‌లోని బ్రిటానీ అనే ప్రాంతంలో నిందితుడు జోయెల్ ఓ ఆసుపత్రిలో సర్జన్‌గా పని చేసేవాడు. 30 ఏళ్లుగా తన వద్దకు వచ్చే రోగులపై దారుణాలకు పాల్పడ్డాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే.. తన వద్దకు వచ్చే రోగుల్లో ఎక్కువ మంది చిన్నారులపై ఈ అఘాయిత్యాలకు పాల్పాడ్డాడు డాక్టర్ జోయెల్. చిన్నారులు మత్తులో ఉండగా లైంగిక దాడి చేసేవాడు. అయితే, అతడి అకృత్యాలు బయటపడింది మాత్రం 2017లో. తన పొరుగింట్లో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడంతో జోయెల్‌పై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు జోయెల్ ఇంట్లో సోదాలు చేపట్టగా 3 లక్షలకు పైగా చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలు ఫొటోలు బయటపడ్డాయి. వీటిలో 650లకు పైగా పోర్నో వీడియోలను దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితుడి మానసిక ప్రవర్తన చూసి పోలీసులు షాక్ అయిపోయారు.
చిన్నారులు, జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యకలాపాలు నెరుపుతున్నట్లు డాక్టర్ జోయెల్ డైరీల్లో చూసి అధికారులు షాక్ అయ్యారు. ఎవరెవరిపై లైంగిక దాడి జరిపిన విషయాలను ఎప్పటికప్పుడు డైరీలో నోట్ చేసుకున్నట్లు గుర్తించారు. ఆ ఘటన తర్వాత మరో నలుగురు చిన్నారులు కూడా జోయెల్ బాధితులని తేలడంతో 2020లో కోర్టు జోయెల్‌ను దోషిగా తేల్చి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. డాక్టర్ జోయెల్ పాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడింది. అయితే, బాధితుల్లో చాలా మందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియదు. జోయెల్ డైరీలో తమ పేర్లను చూసే తాము ఈ విషయం తెలుసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత నాలుగు నెలలుగా ఈ కేసులో విచారణను ముమ్మురం చేయగా.. నిందితుడు జోయెల్ కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అతడు అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయస్థానంలో తెలిపాడు. వీరిలో అత్యధికులు చిన్నారులేనని నిందితుడు జోయెల్ పేర్కొన్నాడు. నేను చాలా క్రూరమైన పనులు చేశానని ఒప్పుకున్నాడు. అయితే ఇది ఆ పిల్లల మనసుకు పెద్ద గాయమేనని తెలిసినా అలా ప్రవర్తించానన్నాడు. ఈ చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని జోయెల్ తెలిపాడు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. ఒకవేళ అతడిని దోషిగా తేలిస్తే మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ ఘటనపై ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు ఆదేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.