Chinese warship live-fire drills: చైనా యుద్ధ విన్యాసాలు.. తీవ్ర ఆందోళన చేసిన న్యూజిలాండ్

Chinese warship live-fire drills in Tasman Sea rattle New Zealand and Australia: చైనా చుట్టూ ఉన్న దేశాలనే కాదు.. సుదూరంగా ఉన్న వాటిని కూడా వేధిస్తోంది. నేడు న్యూజిలాండ్ సముద్ర తీరానికి చాలా దగ్గరలో డ్రాగన్ యుద్ధ నౌకలు లైవ్ ఫైర్ డ్రిల్స్‌ను స్టార్ట్ చేశాయి. దీనిపై ఆ న్యూజిలాండ్ దేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ సముద్ర జలాలపై భారీ బ్లూవాటర్ నేవీని సిద్ధం చేయాలని బీజింగ్ ప్రణాళిక రచించింది. దీనిలో భాగంగా న్యూజిలాండ్ సమీపంలో ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నేవీ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్యలో టాస్మాన్ సముద్రంలో రెండు లైవ్ ఫైర్ డ్రిల్స్‌ను చైనా నేవీ నిర్వహించింది. గత శుక్ర,శ నివారాల్లో ఈ డ్రిల్స్ జరిగాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ దేశాలకు చెందిన పౌర విమానాలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అనూహ్యంగా ఈ విన్యాసాలు ప్రారంభించేసరికి పౌర విమానాలన్నీ రూట్స్‌ను అప్పటికప్పుడు ఛేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై న్యూజిలాండ్ రక్షణ మంత్రి జూడిత్ కొల్లిన్స్ స్పందిచారు. ఇలాంటి విన్యాసాలు అసాధారణమని.. అందులోనూ అంతర్జాతీయ జాలాల్లో ఇటువంటి విన్యాసాలు చేయటం బహు అరుదని అన్నారు. ఆ చైనా నౌకల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయని న్యూజిలాండ్ రక్షణ మంత్రి జూడిత్ కొల్లిన్ వెల్లడించారు. ఒక నౌకలో 112 లాంచ్ సెల్స్ , యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణలు ఉన్నట్లు తెలిపారు. వీటి రేంజి సుమారు 540 నాటికల్ మైళ్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు జూడిత్ కొల్లిన్ వెల్లడించారు.
మరోవైపు న్యూజిలాండ్ సమీపంలో చైనా నేవీ విన్యాసాలపై చైనా ప్రభుత్వ మీడియా స్పందించింది. వెస్ట్రన్ కంట్రీస్ కూడా వాటి సముద్ర జలాల్లో ఇలాంటి ఫీట్స్ చేసుకోవాలని … తద్వారా యుద్ధతంత్రాలకు అలవాటు పడాలని సలహా ఇచ్చింది. చైనా మిలటరీ వ్యహారాల నిపుణుడు షాంగ్ జోంగ్ పింగ్ గ్లోబల్ టైమ్స్‌తో దీనిపై స్పందించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ భవిష్యత్తులో చైనా తీరాల్లోనే కాకుండా.. అంతర్జాతీయ జలాల్లో కూడా ఇటువంటి విన్యాసాలు మరిన్ని చేసే ఆలోచనలో ఉందని వెల్లడించారు.
మరోవైపు… ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంథోనీ అల్బనీస్ స్పందించారు. చైనా అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం నిబంధనలు పాటించినా.. యుద్ధవిన్యాసాలపై ఆస్ట్రేలియా అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఉండాల్సిందని సూచించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పోనీ వాంగ్ స్పందిస్తూ.. ఈ పరిణామాలపై చైనా ఎంబసీని వివరణ కోరనున్నట్లు వెల్లడించారు. కానీ, బీజింగ్ దీన్ని కొట్టిపారేసింది. చైనా దేశ విదేశాంగశాఖ స్పందిస్తూ.. ఏమీ లేకుండానే… ఆస్ట్రేలియా ఆరోపణలు చేస్తోందన్నారు. ఈ విన్యాసాలపై ఆస్ట్రేలియ, న్యూజిలాండ్‌లకు చైనా ముందస్తు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.
మరోవైపు… చైనా ప్రపంచంలోనే అతిపెద్ద నావికా దళాన్ని సిద్ధం చేస్తోందని అమెరికా గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే… 340 కి పైగా యుద్ధనౌకలను నిర్మించింది. ఇవన్నీ గ్రీన్-వాటర్ నేవీగా అమెరికా చూస్తోంది. ఎందుకు అంటే… చైనా తీరానికి సమీపంలోనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు.. అమెరికా అంచనాలను తల క్రిందులు చేస్తూ.. ఆస్ట్రేలియా – న్యూజిలాండ్‌అంతర్జాతీయ సముద్ర జలాల వద్ద కూడా చైనా విన్యాసాలు చేయటం ఆందోళన రేకిస్తోందని నేవీ నిపుణులు అంటున్నారు. ఇటీవల కాలంలో చైనా నౌకానిర్మాణం బ్లూవాటర్ నేవీని కోసం… పెద్ద గైడెడ్-క్షిపణి డిస్ట్రాయర్లు, అటాక్ నౌకలు, విమాన వాహక నౌకలను రూపొందిస్తోంది. వాషింగ్టన్‌కు చెందిన థింక్ ట్యాంక్ ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ విశ్లేషణ ప్రకారం, బీజింగ్ ఓడరేవు యాక్సెస్ కోసం కంబోడియాలో నావికా స్థావరాన్ని శరవేగంగా నిర్మిస్తోంది. ఆఫ్రికా అట్లాంటిక్ తీరం వరకు సైనిక అవుట్‌పోస్టుల కోసం ఇతర దేశాలల్లో వేర్వేరు ప్రాంతాలను ఎంపిక చేసుకునే పనిని వేగవంతం చేస్తోంది. అర్జెంటీనాలోనూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కార్యకలాలపాలు ఏర్పాటు చేస్తోందని FDD నివేదికలు చెబుతున్నాయి. చైనా నేవీ అంతరిక్షంపైన, ఉపగ్రహాలను ట్రాక్ చేయడంతో పాటు పాశ్చాత్య దేశాల కమ్యూనికేషన్లను దొంగచాటుగా వినడం వరకు ప్రతిదీ చేయగలవని FDD చెబుతోంది. ఇవన్నీ అమెరికా ఆధిపత్యం పోతోందన్న దానికి సంకేతాలే.