Crime News: హైదరాబాద్‌లో దారుణం.. ఇద్దరు కుమారులను వేటకొడవలితో నరికి తల్లి సూసైడ్

Mother Commits Suicide After Killing her Two Childrens with vetakodavali: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఏకంగా తన ఇద్దరు కుమారులను అతికిరాతంగా వేటకొడవలితో నరికి చంపింది. ఆ తర్వాత తాను బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్లలోని గాజులరామారంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ లేఔట్‌లో సహస్ర మహేష్ అపార్ట్‌మెంట్‌లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకట్ రెడ్డి, తేజస్విని రెడ్డిలు తమ పిల్లలు హర్షిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డిలతో కలిసి ఉంటున్నారు. వెంకట్ రెడ్డి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది.
అయితే, కుటుంబ కలహాలతో పాటు తేజస్విని రెడ్డి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేక ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, తల్లి చేతిలో పెద్ద కుమారుడు అక్కడికక్కడే చనిపోగా.. చిన్న కుమారుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయారు.