MMTS: ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నంలో బిగ్ ట్విస్ట్.. తెలిస్తే షాక్ కావాల్సిందే!

MMTS Woman Case Train Incident: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించగా.. యువతి రైలు నుంచి దూకేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసలు ఆ యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ ట్రైన్‌లో వెళ్తుంది. ఈ సమయంలో ఆమె రైలులో వెళ్తుండగా.. డోర్ దగ్గరకు వెళ్లి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రీల్స్ చేసేందుకు యత్నించి ప్రమాదకశాత్తు రైలు నుంచి బ్యాలెన్స్ తప్పడంతో కిందపడిపోయిందని పోలీసులు తెలిపారు.
అయితే, ఇలా రీల్స్ చేస్తుండగా కిందపడ్డానని చెబితే అందరూ తిడతారని భయంతోనే తనపై యువకుడు అత్యాచార యత్నం చేసేందుకు యత్నించినట్లు కట్టుకథ చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాలు ఏమీ తెలియకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు మళ్లీ ఆ యువతిని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది.
తొలుత అత్యాచారం జరిగిందని యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిజమని అనుకొని ఉరుకులు పరుగులు పెట్టారు ఇందుకోసం దాదాపు 250కిపైగా సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. సుమారు 100 నుంచి 120 మంది అనుమానితులను ప్రశ్నించగా.. ఎక్కడా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో గందరగోళం నెలకొంది. చివరికి పోలీసుల విచారణలో యువతి నిజం ఒప్పుకుంది. మార్చి 22న ఎంఎంటీఎస్‌లో అత్యాచార ఘటన అంతా ఉత్తిదే అని తేలింది. అసలు అత్యాచారమే జరగలేదని పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును క్లోజ్ చేశారు.