IPL 2025 : టాస్ గెలిచిన కేకేఆర్.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా గుజరాత్ జట్టు మంచి జోరు మీద ఉంది. సోమవారం మరో పోరుకు సిద్ధమైంది. భారీ లక్ష్యాలను ఛేదిస్తున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సేన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది. కోల్‌కతా ఈడెన్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అజింక్యా రహానే మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
ముల్లనూర్‌లో పంజాబ్‌పై చిత్తు చిత్తుగా కోల్‌కతా ఓడిపోయింది. ఈ సారి గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. మరోవైపు మంచి విజయాలతో పట్టికలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ గెలుపే లక్ష్యంగా ఆడనుంది. కోల్‌కతా స్పిన్ త్రయం మోయిన్, నరైన్, వరుణ్ రూపంలో గుజరాత్ బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురు కానుంది.
గుజరాత్ జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, షెర్ఫానే రూథర్‌ఫొర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్ ఉన్నారు.
ఇంప్యాక్ట్ సబ్స్ : ఇషాంత్ శర్మ, మహిపాల్ లొమ్‌రోర్, అనుజ్ రావత్, కరిమ్ జనత్, అర్షద్ ఖాన్ ఉన్నారు.
కోల్‌కతా జట్టు : రహ్మనుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, మోయిన్ అలీ, ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
ఇంప్యాక్ట్ ప్లేయర్స్ : మనీశ్ పాండే, అంగ్‌క్రిష్ రఘువంశీ, రొవ్‌మన్ పావెల్, సిసోడియా, అనుకుల్ రాయ్ ఉన్నారు.