IPL 2025 : టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ అక్టర్ పటేల్

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ విశాఖలోని అభిమానులను అలరించనుంది. సముద్రతీరం కలిగిన వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
18వ సీజన్‌లో లక్నో కెప్టెన్ పగ్గాలు అందుకున్న రిషభ్ పంత్, ఢిల్లీని నడిపిస్తున్న అక్షర్ గతంలో కలిసి ఆడారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈమధ్యే జట్టుతో కలిసిన శార్ధూల్ ఠాకూర్ లక్నో 11 మందిలో చోటు దక్కించుకున్నాడు.