IPL 2025: ఢిల్లీతో కోల్‌కతా బిగ్ ఫైట్.. గెలుపెవరిదో?

Delhi Capitals vs Kolkata Knight Riders IPL 2025 48th Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ వేదికగా రాత్రి 7. 30 నిమిషాలకు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఆడిన ఢిల్లీ 9 మ్యాచ్‌ల్లో ఆరింట గెలుపొందగా.. 3 మ్యాచ్‌ల్లో ఓడింది. కోల్‌కతా 9 మ్యాచ్‌ల్లో మూడింట గెలుపొందగా.. 5 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. ఒక్క మ్యాచ్ రద్దు అయింది.
ఇదిలా ఉండగా, పాయింట్ల పట్టికలో మొదటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తొలి స్థానంలో ఉండగా.. బెంగళూరు జట్టుపై ఓటమి చెందడంతో నాలుగో స్థానానికి పడిపోయింది. కోల్‌కతాపై గెలిస్తే మొదటి రెండు స్థానాల కోసం పోటీలో ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ చేరేందుకు దూకుడుగా కనిపిస్తోంది.
ఇక, కోల్‌కతా విషయానికొస్తే.. విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గత సీజన్‌లో డిపెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా.. ఈ సీజన్‌లో చావోరేవో అన్న పరిస్థితి నెలకొంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా ఓటమి చెందింది. ఒకవేళ ఢిల్లీతో ఇవాళ జరిగే మ్యాచ్‌లో ప్లే ఆఫ్స్ ఆశలు వదుకోవాల్సి ఉంటుంది.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 18 సార్లు గెలుపొందగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ రెండు జట్లు మధ్య ఒక్క మ్యాచ్ మాత్రమే రద్దయింది.