Published On:

SSMB29: రాజమౌళి కోసం మహేష్ సాహసం.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం

SSMB29: రాజమౌళి కోసం మహేష్ సాహసం.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం

SSMB29: స్టార్ హీరోలు ఎన్ని యాక్షన్ సీక్వెన్స్ చేసినా సరే.. షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ చూపించి ఫైట్ చేస్తే వచ్చే కిక్కు వేరే లెవెల్ లో ఉంటుంది.  ఒకప్పుడు కుర్ర హీరోల ప్రతి సినిమాలో ఒక సిక్స్ ప్యాక్ షాట్ ఉండేది. దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. అల్లు అర్జున్ నుంచి సునీల్ వరకు సిక్స్ ప్యాక్ తో కనిపించి కనువిందు చేశారు. ఇక సిక్స్ ప్యాక్ లేకపోయినా షర్ట్ తీసి ఫైట్ చేసిన హీరోలు ఉన్నారు.

 

అంతెందుకు మొన్నటికి మొన్న హిట్ 3 లో నాని సైతం షర్ట్ లేకుండా ఫైట్ చేసి మెప్పించాడు. ఇప్పటివరకు సినిమాల్లో ఒక్కసారి కూడా షర్ట్ లేకుండా కనిపించని ఏకైక హీరో అంటే మహేష్ బాబునే. ఎంత ఫిట్ గా అయినా ఉండని.. ఒక్క సినిమాలో కూడా మహేష్ షర్ట్ విప్పలేదు. అయితే ఈసారి మాత్రం మహేష్ షర్ట్ లేకుండా ఫైట్ చేయడానికి సిద్ధమయినట్లు సమాచారం.

 

ప్రస్తుతం మహేష్.. రాజమౌళిదర్శకత్వంలో SSMB 29  సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం జక్కన్న ఏ రేంజ్ గా కష్టపడుతున్నాడో.. మహేష్ ను కూడా ఆ రేంజ్ లోనే కష్టపెడుతున్నాడు. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసిన మహేష్ ప్రస్తుతం వెకేషన్  మోడ్ లో ఉన్నాడు.

 

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేష్ షర్ట్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటున్నాడట. అయితే మహేష్ కు సిక్స్ ప్యాక్ ఉంటుందా.. ? లేదా.. ? అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇప్పటివరకు ఎంతమంది డైరెక్టర్లు అడిగినా షర్ట్ విప్పని మహేష్.. మొదటిసారి జక్కన్న కోసం షర్ట్ తీసేసి ఫైట్ చేయబోతున్నాడు. ఈ విషయం తెలియడంతోనే అభిమానులు ఊగిపోతున్నారు. ఇదే కనుక నిజమైతే.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో మహేష్ ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.