India-Pakistan : పాకిస్థాన్ పీఎంఓలో సమావేశం.. ఇస్లామాబాద్‌లో మోగిన సైరన్లు

Sirens blare in Islamabad : భారత్ సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్ యత్నించింది. దీంతో మన సైన్యం పాక్‌కు గట్టి సమాధానిచ్చింది. పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో గగనతల రక్షణ రాడార్లు, వ్యవస్థలను టార్గెట్ చేసుకొని విరుచుకుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్‌లో సైరన్ల మోత మోగింది. ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండటం గమనార్హం.
పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి సమయంలో కొద్దిగంటల క్రితం పాక్ ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీలో పేలుళ్ల శబ్దాలు వచ్చాయి. భారత్ పాక్ దాడుల యత్నాన్ని తిప్పికొట్టింది. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దెబ్బతీసింది. ఈ మేరకు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. తాజాగా పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఉన్నతస్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు. సమావేశం జరుగుతుండగా సైరన్లు మోగాయి.