Published On:

RR vs GT: రాయల్స్ కు వైభవోపేతమైన విజయం

RR vs GT: రాయల్స్ కు వైభవోపేతమైన విజయం

RR vs GT:  రాజస్థాన్ రాయల్స్ కు వైభవోపేతమైన విజయం. సోమవారం గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 101పరుగులు చేశాడు. అందులో 11సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. పట్టుమని 15ఏళ్లుకూడా లేని ఆ యువ సంచలనం క్రీజులోకి వస్తూనే సిక్సులతో రెచ్చిపోయాడు. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ పై రాజస్థాన్ విజయం సాధించింది. వైభవ్ కు తోడుగా యశస్వి 40 బంతుల్లో 70పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వైభవ్ చేసిన విద్వంసకర సెంచరీతో 15.5 ఓవర్లలోనే రాజస్థాన్ విజయాన్ని అందుకుంది. ఈ సీజన్ లో పది మ్యాచులు ఆడిన రాజస్థాన్ కు ఇది మూడవ విజయం.

 

క్రీజులోకి వస్తూనే బౌలర్ ఎవ్వరైనా సరే బాల్ బౌండరీ దాటాల్సిందేనంటూ బ్యాటింగ్ చేశాడు వైభవ్. కరీం జానత్ వేసి ఓవర్ లో మూడు ఫోర్లు, 3 సిక్సులతో ఏకంగా 30పరుగులను రాబట్టాడు. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సీజన్ లలో వైభవ్ శతకం గుర్తుండిపోతుంది. సిరాజ్, ఇషాంత్ లాంటి మేటి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకరకంగా బౌలింగ్ వేయాలంటే బయమేసేంతగా ఊచకోతకోశాడు. ఐపీఎల్ చరిత్రలో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.

 

జైపూర్ వేధికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడగా నిర్ణిత 20ఓవర్లలో గుజరాత్ 209పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 50బంతుల్లో 84పరుగులు చేశాడు. సాయిసుదర్శన్ 39, జోస్ బట్లర్ 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ సీజన్ లో బట్లర్ కు ఇది నాలుగవ హాఫ్ సెంచరీ. నిర్ణిత 20 ఓవర్లలో గుజరాత్ 210పరుగులు చేసింది.

 

లక్ష్య చేధనలో భాగంగా యశస్వీ జైస్వాల్, వైభవ్ ధీటుగా ఆడారు. జైస్వాల్ కు 2పరుగుల వద్ద బట్లర్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ వచ్చింది. సిరాజ్ వేసిన మొదటి ఓవర్లోనే సిక్సర్ కొట్టాడు వైభవ్. ఇషాంత్ బౌలింగ్ లో 6,6,4థీటుగా ఆడాడు. 38 బంతుల్లో 101పరుగులు చేయగా, అందులో 11సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. దీంతో 15.5 ఓవర్లలో రాజస్థాన్ విజయాన్ని నమోదు చేసుకోంది.

 

 

Gujarat: సాయి సుదర్శన్ (సి) పరాగ్ (బి) తీక్షణ 39; గిల్ (సి) పరాగ్ (బి) తీక్షణ 84; బట్లర్ (నాటౌట్) 50; వాషింగ్టన్ సుందర్ (సి) హెట్మెర్ (బి) సందీప్ 13; తెవాటియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్ 9; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 9;
బౌలింగ్: ఆర్చర్ 4-0-49-1, తీక్షణ 4-0-35-2, యు«ద్వీర్ 3-0-38-0, సందీప్ శర్మ 4-0- 33-1, పరాగ్ 1-0-14-0, హసరంగ 4-0-39-0.

 

రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 70; వైభవ్ (బి) ప్రసిద్ కృష్ణ 101; నితీశ్ రాణా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ 4; పరాగ్ (నాటౌట్) 32; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు 212.
బౌలింగ్: సిరాజ్ 2-0-24-0, ఇషాంత్ 2-0-36-0, సుందర్ 1.5-0-34-0, ప్రసిద్ కృష్ణ 4-0- 47-1, రషీద్ 4-0-24-1, కరీమ్ 1-0-30-0, సాయి కిషోర్ 1-0-16-0.