IPL 2025 : టాస్ గెలిచిన గుజరాత్.. బౌలింగ్ ఎంచుకున్న శుభ్‌మన్ గిల్

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో దుమ్మురేపుతున్న ముంబయి ఇండియన్స్ జట్లు సొంత మైదానంలో మరో మ్యాచ్‌కి సిద్ధమైంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన హార్దిక్ పాండ్యా సేన వాంఖడేలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకుని ముంబయి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
నిషేధిత డ్రగ్ కారణంతో జట్టుకు దూరమైన కగిసో రబడ జట్టులోకి వచ్చాడని శుభ్‌మన్ గిల్ చెప్పాడు. మొదటగా బ్యాటింగ్ చేయడం తమ వ్యూహాలను పక్కాగా అమలు చేయడమే తమకు ప్రధానమని ముంబయి కెప్టెన్ పాండ్యా వెల్లడించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3, 4వ స్థానాల్లో ముంబయి ఇందియన్స్ ఉండగా, రెండు జట్లకు ఇది కీలక మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ కానుంది. రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమంటున్నారు విశ్లేషకులు.
ముంబయి తుది జట్టు : రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, కార్బిన్ బాస్చ్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా ఉన్నారు.
ఇంప్యాక్ట్ ప్లేయర్స్ : కరణ్ శర్మ, రాజ్ బవ, రాబిన్ మింజ్, రీసే టాప్లే, అశ్వనీ కుమార్ ఉన్నారు.
గుజరాత్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఉన్నారు.
ఇంప్యాక్ట్ ప్లేయర్స్ : వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లొమ్‌రోర్, అనుజ్ రావత్, దసున్ శనక, షెర్ఫానే రూథర్‌ఫొర్డ్ ఉన్నారు.