Tamannaah Bhatia: ప్రియుడిని మర్చిపోలేక కష్టపడుతున్న తమన్నా.. క్షణం కూడా తీరిక లేకుండా.. ?

Tamannaah Bhatia: ఎంతవారు అయినా ఒక్కసారి బ్రేకప్ అయ్యింది అంటే.. వారికి ఈ ప్రపంచమే ఒక నరకంగా కనిపిస్తుంది. ప్రేమించినవారు పక్కనే ఉంటే వచ్చే ఆనందం.. వారు లేకపోతే ఏదో తెలియని వెలితి మొదలవుతుంది. అందుకే బ్రేకప్ అయ్యాకా .. చాలామంది అబ్బాయిలు జిమ్ అని కష్టపడుతుంటారు. అమ్మాయిలు క్షణం కూడా తీరిక లేకుండా పనులు చేస్తూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందుకు సెలబ్రిటీలు ఏమి అతీతం కాదు. అందులో తమన్నా కూడా ఉంది.
అందాల ముద్దగుమ్మ తమన్నా తెలుగులో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగినప్పుడు అంతా బాగానే ఉంది. ఏ ముహూర్తాన ఈ చిన్నది బాలీవుడ్ లో అడుగుపెట్టిందో కానీ, అప్పటి నుంచి ఆమె బాలీవుడ్ కే పరిమితమయ్యింది. అక్కడ నటుడు విజయ్ వర్మతో పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని కెమెరా కంటికి కనిపించేలా రచ్చ చేశారు. ఫోటోషూట్స్, ఈవెంట్స్, టూర్స్, వెకేషన్స్.. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలా ఒకటి అని చెప్పలేం.
అంతేనా ఒకరిపై ఒకరు అపారమైన ప్రేమను కురిపించుకున్నారు. తమన్నాను మించిన ప్రేమ లేదని విజయ్. అతడు అర్ధం చేసుకున్నట్లు ఎవరు అర్ధం చేసుకోలేదని తమ్ము చెప్పుకొచ్చారు. వీరి ప్రేమను చూసి అందరూ పెళ్లి పీటలు ఎక్కేస్తారేమో అనుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు ఒక్కసారిగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారు. అందరిలా విడిపోకుండా ఫ్రెండ్స్ గా కలిసి తిరుగుతున్నారు. కానీ, ఆ బ్రేకప్ బాధ ఇద్దరిలోనూ కనిపిస్తుంది.
ఇక ఈ బ్రేకప్ బాధ నుంచి బయటపడడానికి ఇద్దరూ తమ తమ పనుల్లో బిజీగా మారారు. ముఖ్యంగా తమన్నా క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తుంది. ఒక పక్క ఐటెంసాంగ్స్.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారింది. రైడ్ 2 లో ఐటెంసాంగ్ తో మెప్పించిన మిల్కి బ్యూటీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. రేంజర్, వివాన్.. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను లైన్లో పెట్టింది. తన బ్రేకప్ బాధను కనిపించకుండా చేయడానికేఅమ్మడు తీరిక లేకుండా పనిచేస్తుందంట. ఏదిఏమైనా ఈ బ్రేకప్ వలన ఈ చిన్నదాని కెరీర్ ఒక గాడిన పడితే చాలు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.