Published On:

HCA : మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్.. ఉప్ప‌ల్ స్టేడియంలో పెవిలియ‌న్ పేరు తొల‌గింపు

HCA : మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్.. ఉప్ప‌ల్ స్టేడియంలో పెవిలియ‌న్ పేరు తొల‌గింపు

HCA : ఇండియా జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌‌కు బిగ్‌షాక్ తగిలింది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ మైదానంలోని ‘నార్త్ పెవిలియ‌న్‌’‌కు పెట్టిన అత‌డి పేరును తొల‌గించనున్నారు. అజారుద్దీన్‌పై 2019లో న‌మోదైన కేసును విచారిస్తున్న‌ సుప్రీంకోర్టు విశ్రాంత నాయ్య‌మూర్తి వి.ఈశ్వ‌ర‌య్య నార్త్ స్టాండ్‌ను ‘అజారుద్దీన్ పెవిలియ‌న్‌’గా పిల‌వ‌కూడ‌ద‌ని శ‌నివారం హెచ్‌సీఏను ఆదేశించారు. దీంతో ఆ స్టాండ్‌ను ఇక‌పై అజారుద్దీన్ పేరుతో పిల‌వ‌కూడద‌ని హెచ్‌సీఏ ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌నుంది.

 

2019లో హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా సేవలు..
భారత జట్టుకు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ 2019లో హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా అనేక సేవలు అందించాడు. అధ్యక్షుడిగా ఉన్న స‌మ‌యంలో ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకున్నాడనే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఎవ‌రిని సంప్ర‌దించ‌కుండా నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ త‌న పేరు పెట్టుకున్నాడు. అప్ప‌టికే ఆ స్టాండ్‌ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ పేరుతో ఉంది. అంబుడ్స్‌మ‌న్ ఈ విష‌యాన్ని తీవ్ర త‌ప్పిదంగా ప‌రిగ‌ణించింది. నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పెవిలియ‌న్‌గా పిల‌కూడ‌ద‌ని హెచ్‌సీఏకు స్ప‌ష్టం చేసింది.మ్యాచ్ టికెట్లపై కూడా అజారుద్దీన్ పేరు ఉండ‌కూడ‌ద‌ని తెలిపింది. దాంతో అంబుడ్స్‌మ‌న్ ఆదేశాల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌నుంది.

 

కాంప్లిమెంట‌రీ పాస్‌ల‌ వివాదం
ఈమ‌ధ్య హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు యాజ‌మాన్యం మ‌ధ్య కాంప్లిమెంట‌రీ పాస్‌ల‌ వివాదం నెలకొన్న విష‌యం తెలిసిందే. త‌మ‌ను బాగా ఇబ్బంది పెడుతున్నార‌ని హైద‌రాబాద్ ఫ్రాంచైజీ బీసీసీఐకి లేఖ కూడా రాసింది. ఇరుప‌క్షాలు స‌మావేశ‌మై ఒప్పందం చేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. ఇంత‌కుముందు మాదిరిగానే హెచ్‌సీఏకు 3,900 కాంప్లిమెంట‌రీ పాస్‌ల‌ను ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు కేటాయించ‌నుంది.

ఇవి కూడా చదవండి: