Published On:

Shadashtak Yog 2025: మే 18న షడష్టక యోగ ప్రభావం.. వీరు ధనవంతులయ్యే ఛాన్స్

Shadashtak Yog 2025: మే 18న షడష్టక యోగ ప్రభావం.. వీరు ధనవంతులయ్యే ఛాన్స్

Shadashtak Yog on May 18th 2025: మే 18న పాప గ్రహం అయిన రాహువు తన రాశిని మార్చుకోనున్నాడు. రాహువు మీన రాశిలో తన ప్రయాణాన్ని ముగించి, శని రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడే దాదాపు 18 నెలలు ఉంటాడు. కుంభరాశిలో రాహువు సంచారం కారణంగా.. కుజుడు నీచ రాశి అయిన కర్కాటక రాశిలో ఉంటాడు. దీని కారణంగా షడష్టక యోగం ఏర్పడుతుంది. కుజుడు నీచ రాశిలో ఉండటం. రాహువు సంచారం చేయడం వల్ల రాహువు కుజుడు నుండి ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు.

 

కుజుడు రాహువు నుండి ఆరవ ఇంట్లో ఉంటాడు. జ్యోతిష్యశాస్త్రంలో.. కుజుడు, రాహువులను శుభ గ్రహాలుగా పరిగణించరు. ఇలాంటి పరిస్థితిలో.. మే 18న ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా, ఒకరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. షడాష్టక యోగం కారణంగా దేశంలో, ప్రపంచంలో ఉద్రిక్తత, యుద్ధం, ఉన్మాదం, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు మరియు రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తీవ్రమయ్యే అవకాశం ఉంది. షడష్టక యోగం కారణంగా కొన్ని రాశుల వ్యక్తులు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

 

షడష్టక యోగం అంటే ఏమిటి ..?

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రెండు గ్రహాలు ఒకదానికొకటి ఆరవ , ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు ఈ రకమైన యోగం ఏర్పడుతుంది. ఇది కాకుండా.. రెండు గ్రహాల మధ్య 150 డిగ్రీల వ్యత్యాసం ఉన్నప్పుడు కూడా ఇటువంటి కలయిక ఏర్పడుతుంది. ఈ షడష్టక యోగం కారణంగా అనేక రకాల సవాళ్లు, సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. రాహువు, కుజుడు ఇద్దరూ పాప గ్రహాలు , క్రూర గ్రహాలుగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితిలో.. రెండు ఉగ్ర గ్రహాల కలయిక ఈ యోగాన్ని మరింత శక్తివంతం చేస్తోంది. ఈ షడష్టక యోగం సామాజిక సంబంధాలు, ఆర్థిక నిర్ణయాలు, మానసిక ప్రశాంతతను కూడా ప్రభావితం చేస్తుంది.

 

మేష రాశి:

ఈ రాశి వారికి షడష్టక యోగం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మీరు ఆఫీసుల్లో సవాళ్లను ఎదుర్కుంటారు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఆఫీసుల్లో తప్పులకు దారితీస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

 

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి షడష్టక యోగం అనేక సమస్యలను తెస్తుంది. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆఫీసుల్లో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. పిల్లలకు సంబంధించిన ఆందోళనలు కూడా మిమ్మల్ని బాధడతాయి. కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన పెరగుతాయి. అంతే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

 

ధనస్సు:

ధనస్సు రాశి వారికి షడష్టక యోగం మంచిదని చెప్పలేము. ఈ సమయంలో మీరు వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆర్థిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. రాహువు, కుజుడి కలయిక వల్ల ఇంట్లో ఉద్రిక్తత లేదా తేడాలు పెరగుతాయి. కుటుంబ విషయాలలో తేడాలు తలెత్తుతాయి. అంతే కాకుండా మీరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా పెట్టుబడుల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులు మీ అవకాశాలు పెరుగుతాయి.