Published On:

Bhairavam: భైరవం నుంచి మూడో సింగిల్.. బ్రదర్ హుడ్ ప్రోమో చూసారా.. ?

Bhairavam: భైరవం నుంచి మూడో సింగిల్.. బ్రదర్ హుడ్ ప్రోమో చూసారా.. ?

Bhairavam: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది, అదితి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమిళ్ లో భారీ విజయాన్ని అందుకున్న గరుడన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

ఇక ఈ సినిమా రిలీజ్ వాయిదాల మీద నడుస్తున్న విషయం తెల్సిందే. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా.. రిలీజ్ డేట్ లేక ఆగిపోయింది. ఇక ఈమధ్యనే మే 30 న భైరవం రిలీజ్ కానుందని మేకర్స్ రిలీజ్ చేశారు. సేమ్ రోజున విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కింగ్డమ్ జూన్ కి వాయిదా పడిందని, అందుకే ఆ డేట్ ను భైరవం లాక్ చేసిందని తెలుస్తోంది.

 

ఇక రిలీజ్ డేట్ ప్రకటించడంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాట రిలీజ్ కి ముహూర్తం ఖరారు చేశారు. దుమ్ము దుమారో అంటూ మొదలైన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో ముగ్గురు హీరోలు.. హీరోయిన్స్ తో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫుల్ సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో మంచు మనోజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి: