Published On:

PM Modi Meeting with 3 Army Cheif: త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం!

PM Modi Meeting with 3 Army Cheif: త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం!

Key meeting Chaired by Prime Minister Modi with 3 Chief: భారత్‌-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్‌ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

ఉన్నతస్థాయి సమావేశానికి ముందు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, దోవల్‌ వరుసగా ప్రధాని మోదీతో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో భారత్‌, పాకిస్థాన్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై ఇండియా ఆర్మీ దాడులు చేసింది. దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మృతిచెందారు. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

ఇవి కూడా చదవండి: