Published On:

Virat Kohli Retirement: భారత అభిమానులకు మరో షాక్.. హిట్‌మ్యాన్ బాటలో విరాట్ కోహ్లీ..? బీసీసీఐ ఊహించని ట్విస్ట్!

Virat Kohli Retirement: భారత అభిమానులకు మరో షాక్.. హిట్‌మ్యాన్ బాటలో విరాట్ కోహ్లీ..? బీసీసీఐ ఊహించని ట్విస్ట్!

Virat Kohli Retirement from Test Matches: ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టులకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. దీంతో అతడి బ్యాట్ నుంచి వచ్చిన అద్భుతమైన నాక్స్‌ను తలచుకొని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. రోహిత్ శర్మ ఇచ్చిన షాక్ నుంచి తేరుకునే లోపే ఇండియా అభిమానులకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. హిట్‌మ్యాన్ రోహిత్ బాటలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నడవాలని నిర్ణయం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. లాంగ్ ఫార్మాట్‌కు అతడు గుడ్‌బై చెప్పాలని ఫిక్స్ అయ్యాడా అనే వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీకి బీసీసీఐ ఊహించని ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తోంది.

 

ఒప్పుకోని బోర్డు పెద్దలు..

టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకొని రోహిత్‌ శర్మలాగే వన్డేల్లో మాత్రమే ఆడాలని విరాట్ భావిస్తున్నాడని సమాచారం. విషయం బీసీసీఐకి తెలిసింది. బోర్డు పెద్దలు మాత్రం అతడి నిర్ణయాన్ని వ్యతిరేకించారని తెలుస్తోంది. హిట్‌మ్యాన్ రోహిత్ రిటైర్మెంట్‌కు ఓకే చెప్పిన బీసీసీఐ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఒప్పుకోవడం లేదని సమాచారం. లిమిటెడ్ ఓవర్స్‌లో అదరగొట్టే రోహిత్‌ టెస్టుల్లో ఫామ్‌లో లేడు. కానీ, విరాట్ అలా కాదు. అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. లాంగ్ ఫార్మాట్‌లో కోహ్లీకి టన్నుల కొద్దీ పరుగులు, లెక్కకు మించి సెంచరీలు, సూపర్ రికార్డులు ఉన్నాయి. విరాట్‌ రిటైర్మెంట్‌కు బోర్డు పెద్దలు నో చెప్పారని తెలుస్తోంది.

 

రివర్స్ ట్విస్ట్ తప్పదా..

విరాట్ కోహ్లీ దూరమైతే టెస్టుల్లో ఇండియా టీంపై తీవ్రంగా ప్రభావం పడుతుందని బీసీసీఐ భయపడుతోంది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి కుర్రాళ్లు జట్టులో కంప్లీట్‌గా సెటిల్ అయ్యేంత వరకు విరాట్ లాంటి అనుభవం ఉన్న ఆటగాడు అవసరమని బోర్డు భావిస్తోంది. టీమిండియా త్వరలో ఇంగ్లండ్‌‌తో కీలకమైన టెస్ట్ సిరీస్‌లో ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ న్యూ సైకిల్‌లో ముందుకెళ్లాలంటే టూర్‌లో నెగ్గడం తప్పనిసరి. ఇంగ్లాండ్ టూర్‌కు రావాలని, మరికొన్నేళ్లు టెస్ట్ టీంలో కొనసాగాలని విరాట్ కోహ్లీకి బోర్డు పెద్దలు సూచించారని తెలుస్తోంది. కోహ్లీ మాత్రం ఇంకా నిర్ణయం చెప్పలేదని, అతడు రిటైర్మెంట్‌పై పట్టుబడితే బీసీసీఐ చేసేదేమీ లేదని సమాచారం. ఇష్టం లేకుండా ఎక్కువ రోజులు అడితే టీమిండియాకే నష్టం. రిటైర్మెంట్ వద్దంటూ రిక్వెస్ట్‌తో బీసీసీఐ ట్విస్ట్ ఇచ్చినా.. తప్పదంటూ విరాట్ కోహ్లీ రివర్స్ ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని వినిపిస్తోంది.

 

ఇవి కూడా చదవండి: