Published On:

BCCI Central Contract 2024-25 : BCCI సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్​ రిలీజ్! శ్రేయాస్ ఇన్, పంత్ కు బంపర్ ఆఫర్

BCCI Central Contract 2024-25 : BCCI సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్​ రిలీజ్! శ్రేయాస్ ఇన్, పంత్ కు బంపర్ ఆఫర్
  • విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు A+ కేటగిరీని నిలుపుకున్నారు
  • శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తిరిగి జాబితాలోకి వచ్చారు
  • వరుణ్, అభిషేక్, నితీష్, హర్షిత్ మరియు ఆకాష్ దీప్ కొత్తగా చేరారు 


2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్

2024-25 సంవత్సరానికిగాను సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ను BCCI విడుదల చేసింది. మొత్తం 34మంది సభ్యులు జాబితాలో ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు A+ కేటగిరిలో ఉండగా, శ్రేయాస్ అయ్యార్ ఇషాన్ కిషన్ తిరిగి జాబితాలోకి వచ్చారు. వరుణ్, అభిషేక్, నితీష్, హర్షిత్, ఆకాష్ దీప్ కోత్తగా లిస్ట్ లో చేరారు. వీరితో పాటు బ్యాటర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు గ్రేడ్ B నుంచి A కు ప్రమోషన్ లభించింది.

 


గ్రేడ్ B లోకి శ్రేయస్ అయ్యర్
అద్భుతమైన ఫామ్ లో ఉన్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ B వరించింది. గత ఐదు ఇన్నింగ్స్‌లలో 48.60 సగటుతో 243 పరుగులు చేశాడు. వికెట్ కీపర్, బ్యట్స్ మెన్ అయిన ఇషాన్ కిషన్ ను లిస్ట్ లో చేర్చారు. కిషన్ గ్రేడ్ Cలో ఉన్నాడు. గతంలో రంజీలను ఆడకపోవడం వల్లనే అయ్యర్, కిషన్ లు కాంట్రాక్టులను కోల్పోయినట్లుగా క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని BCCI  అధికారికంగా ప్రకటించలేదు.

 

2024లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి  తిరిగి వచ్చిన వరుణ్ చక్రవర్తికి గ్రేడ్ C లభించింది. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ మూడు ఇన్నింగ్స్‌లలో తొమ్మిది వికెట్లను పడగొట్టాడు. 2024లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండవ బౌలర్ గా నిలిచాడు. ఆల్ రౌండర్ నితిష్ కుమార్ రెడ్డి తన తొలి కాంట్రాక్టును పొందాడు. ఇతను 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన నాలుగవ టెస్ట్ లో సెంచరీ చేశాడు నితిష్. ఆతనితో పాటు ఓపెనర్ అభిషేక్ శర్మ , ఫాస్ట్ బౌలర్లు ఆకాష్ దీప్, హర్షిత్ రాణా కూడా మొదటిసారి కాంట్రాక్టులను పొందారు. జితేష్ శర్మ, శార్దూల్ ఠాకూర్, కెఎస్ భరత్, అవేష్ ఖాన్ గ్రేడ్ C నిలుపుకోలేకపోయారు.

 

కాంట్రాక్టు పొందిన ప్లేయర్ల జాబితా

 

గ్రేడ్​ A+ ప్లేయర్స్​
1 రోహిత్​ శర్మ
2 విరాట్ కోహ్లీ
3 జస్​ప్రీత్ బుమ్రా
4 రవీంద్ర జడేజా

 

 

గ్రేడ్​ A ప్లేయర్స్​
1 హార్దిగ్ పాండ్య
2 Md. షమీ
3 కేఎల్ రాహుల్
4 శుభ్​మన్ గిల్
5 Md. సిరాజ్
6 రిషభ్​ పంత్

 

గ్రేడ్​ B ప్లేయర్స్​
1 సూర్య కుమార్ యాదవ్
2 శ్రేయస్​ అయ్యర్
3 కుల్దీప్ యాదవ్
4 అక్షర్ పటేల్
5 యశస్వి జైస్వాల్

 

గ్రేడ్ C​ ప్లేయర్స్​
1. ఇషాన్ కిషన్

2. అర్ష్‌దీప్ సింగ్

3. సంజు శాంసన్

4. రింకు సింగ్

5. వాషింగ్టన్ సుందర్

6. వరుణ్ చక్రవర్తి

7. శివం దుబే

8. తిలక్ వర్మ

9. రుతురాజ్ గైక్వాడ్

10. ప్రసిద్ధ్ కృష్ణ

11. రజత్ పాటిదార్

12. హర్షిత్ రాణా

13. సర్ఫరాజ్ ఖాన్

14. నితీశ్​ కుమార్ రెడ్డి

15. ముకేశ్ కుమార్

16. అభిషేక్ శర్మ

17. ఆకాశ్ దీప్

18. రవి బిష్ణోయ్

19. ధ్రువ్ జురెల్

 

మొత్తం 34మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేయగా ఇందులో రిషబ్ పంత్ Grade B నుంచి A కు పదోన్నతి పొందాడు. Grade B లో శ్రేయస్ అయ్యర్ కు చోటు లభించగా,  ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా Grade C లోకి ప్రమోట్ అయ్యారు.