Ambati Rayudu Requests Virat: కోహ్లీ.. దయచేసి రిటైర్ అవ్వొద్దు: మాజీ క్రికెటర్ల విన్నపం..!

Ambati Rayudu requests to Virat Kohli not to Retire: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్ అడుగు జాడల్లో మరో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని విరాట్‌ను బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం. భారత మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ ఇప్పుడే సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకొద్దని కోరుతున్నారు. అనుభవజ్ఞుడైన కోహ్లీ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు కీలకమవుతాడని పేర్కొన్నారు.
విరాట్ అనుభవజ్ఞుడు: నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ..
విరాట్ రిటైర్ అవ్వాలనుకుంటున్నాడని, అతను తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిందని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. కోహ్లీ ఉద్దేశం సరైనది, గొప్పదని కొనియాడారు. పాతతరం తప్పుకొని కొత్త తరానికి అవకాశం కల్పించాలని, కానీ ఇది సరైన సమయం, సందర్భం కాదని స్పష్టం చేశారు. సవాళ్లులతో కూడిన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తున్నామని, టెస్టు క్రికెట్ ఆడే ఇతర దేశాలు కూడా అక్కడ గెలవడం కష్టమని చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్ పర్యటనలో టీంమిండియాకు విరాట్ కోహ్లీ ఆపద్బాంధవుడు అవుతాడని పేర్కొన్నారు. అతను అనుభవజ్ఞుడు అన్నారు. రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడని, ఇలాంటి నేపథ్యంలో అనుభవం లేని జట్టును ఇంగ్లాండ్‌కు పంపొద్దని సూచించాడు.
టీంమిండియాకు మీ అవసరం చాలా ఉంది: అంబటి రాయుడు..
విరాట్ కోహ్లీ దయచేసి రిటైర్ అవ్వొద్దని అంబటి రాయుడు కోరారు. ఇప్పుడు భారత్ జట్టుకు మీ అవసరం చాలా ఉందని చెప్పుకొచ్చారు. మీలో ఆడే సత్తా చాలా ఉందని తెపలిపారు. మీరు భారత్ తరఫున బరిలోకి దిగకపోతే టెస్టు క్రికెట్‌కు కళ ఉండదని చెప్పారు. దయచేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
రిటైర్మెంట్ ఆలోచన వెనక్కి తీసుకోవాలి: బ్రియాన్ లారా..
టెస్టు క్రికెట్‌కు విరాట్ చాలా కీలమని బ్రియాన్ లారా తెలిపారు. రిటైర్మెంట్ ఆలోచన వెనక్కి తీసుకోవాలని కోరారు. కోహ్లీని ఒప్పిస్తామని చెప్పారు. అతను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కావడం లేదని, తన మిగిలిన టెస్టు కెరీర్‌లో సత్తా చాటుతాడని తెలిపారు. 60 కంటే ఎక్కువ సగటునే కలిగి ఉంటాడని బ్రియాన్ లారా స్పష్టం చేశాడు.