BCCI Key Decision: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు క్యాన్సిల్

BCCI Sensational Decision on Pakistan Cricket after Pahalgam Terror attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. పర్యాటక కోసం వెళ్లిన టూరిస్టులు చంపొద్దని ఎంత వేడుకున్నా మతం పేరు అడిగి మరి దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య 2012-13 ఏడాదిలో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఇటీవల ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తాజాగా, పహల్గాహ్ ఉగ్రదాడి ఘటనతో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించవద్దని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
భారత్.. చివరిసారిగా పాకిస్థాన్‌కు 2008లో పర్యటించగా.. ఆ సమయంలో భారత్ ఆసియా కప్‌లో ఆడింది. అయితే 2008లో ముంబైలో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత నుంచి భారత్.. పాకిస్థాన్ వెళ్లడం లేదు. కానీ ఐసీసీ కారణంగా పాకిస్థాన్‌తో కొన్ని వేదికట్లో ఆడతున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్న విషయంపై ఐసీసీకి అవగాహన ఉంటుందని అనుకుంటున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అన్నారు.