BCCI Announced Cash Reward: ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా

BCCI Announced Cash Reward for ICC Champions Trophy Winner Team India: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. తాజాగా, బీసీసీఐ జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. ఈ మేరకు రూ.58 కోట్లను క్యాష్ రివార్డుగా బోర్డు ప్రకటించింది.
టీమిండియా ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీ ఈ నగదు అందజేయనున్నారు. కాగా, ఐసీసీ అందజేసిన ప్రైజ్ మనీ రూ.19.50కోట్లతో పోలిస్తే.. బీసీసీఐ ప్రకటించిన నజరానా మూడింతలు ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఇదిలా ఉండగా, టీమిండియా 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుపొందింది. తొలుత బంగ్లాదేశ్‌తో భారత్ తలపడగా.. టీమిండియా గెలుపుతో లాంఛనంగా ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసింది. దీంతో భారత్ సెమీస్‌లో దూసుకెళ్లింది.
ఇక, సెమీస్‌లో ఆస్ట్రేలియా జట్టుపై ఘన విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. మార్చి 9న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌ను భారత్ మట్టి కరిపించి ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. అయితే తాజాగా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవజిత్ సైకియా హర్షం వ్యక్తం చేశారు. టీమిండియా ఆటగాళ్లతో పాటు సపోర్ట్ సిబ్బందిని గుర్తించి నజరానా ప్రకటించారు. వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలవడం ఆనందంగా ఉందన్నారు. ఇంటర్నేషనల్ వేదికపై భారత్ సత్తా చాటుతోందని అన్నారు.