Ravindra Jadeja: భారత్‌పై బీసీసీఐ ప్రశంసలు.. రవీంద్ర జడేజాకు బెస్ట్ ఫీల్డర్ అవార్డు

Ravindra Jadeja Wins Fielding Medal In champions trophy final: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకున్న భారత్‌పై బీసీసీఐ ప్రశంసల వర్షం కురిపించింది. టీ20లు, వన్డేలలో భారత్ జట్టు టాప్ ర్యాంక్ జట్టుగా ఉందని కొనియాడింది. గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో రోహిత్ సేన అద్భుతంగా ప్రదర్శన ఇస్తుందని తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి వంద శాతం ఫర్పెక్ట్ టీంగా నిలిచిందని పేర్కొంది. అన్ని సవాళ్లను ఎదుర్కొని, నిర్భయంగా, క్రమశిక్షణతో టోర్నీలో విజేతగా నిలిచిందని బీసీసీఐ వెల్లడించింది.
అలాగే ప్రపంచ టోర్నీలలో విజయ కాంక్షతో భారత్ దూసుకెళుతోందని వివరించింది. ఇక దుబాయ్ వేదిక జరిగిన ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ జట్టుపై భారత్ తన సత్తా చాటిందని బీసీసీఐ పొగిడింది. ఈ చరిత్రాత్మక విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్రను బీసీసీఐ విశేషంగా కొనియాడింది. రోహిత్ శర్మలోని అసాధారణమైన నాయకత్వ లక్షణాలు, జట్టును గెలుపుబాటలో నిలపడంలో సహకరించాయని పేర్కొంది. రోహిత్ నేతృత్వంలో ఇండియా రెండోసారి ఐసీసీ టైటిల్ సొంతం చేసుకుందని తెలిపింది.
2024 టీ20 వరల్డ్ కప్‌తో పాటు 2025 చాంపియన్స్ ట్రోఫీ విజయంతో రోహిత్ ఓ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యారని ప్రశంసించింది. మెడ్ కోచ్ గౌతం గంభీర్ పాత్రను కూడా బీసీసీఐ మెచ్చుకుంది. గంభీర్ సాహసోపేత విధానం, వ్యూహాలు, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయని వివరించింది. భారత క్రికెట్‌లో ఈ విజయం ఓ మైలురాయి అని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తెలిపారు. ఒత్తిడిలోనూ జట్టు ఆడిన తీరు అద్భుతమని బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఐసీసీ టైటిల్ గెలవడం ఎప్పటికీ ప్రత్యేకమే అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. ఇది అత్యద్భుత విజయమని బీసీసీఐ ట్రెజ రర్ ప్రక్తేజ్ సింగ్ భాటియా తెలిపారు.
అంతే కాకుండా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు బెస్ట్ ఫీల్డర్ అవార్డును ప్రకటించింది. బౌలింగ్ పటిష్టంగా చేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. మైదానంలో బంతిని ఆపేందుకు అతను పడిన కష్టం, దాన్ని వికెట్‌వైపు విసిరిన విధానం అద్భుతమని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అన్నారు. అందుకే ఈ మెడల్‌ను రడేజాకు అందిస్తున్నామని దిలీప్ అన్నారు.