Last Updated:

Nara Lokesh: సజ్జల, బొత్సలపై కేసులు ఉండవా సీఎంగారూ.. నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు వేసారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే కేసులు పెడుతున్నారని గుర్తు చేసారు.

Nara Lokesh: సజ్జల, బొత్సలపై కేసులు ఉండవా సీఎంగారూ.. నారా లోకేష్

Andhra Pradesh: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు వేసారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే కేసులు పెడుతున్నారని గుర్తు చేసారు. అయితే సీఎం జగన్ కు అవగాహన లేదన్న సజ్జల, బొత్సలపై కేసులు ఎందుకు ఉండవంటూ ప్రశ్నించారు.

జగన్ రెడ్డి గారు! మీ పాలనా వైఫల్యాల పై సోషల్ మీడియాలో చిన్న విమర్శ చేస్తేనే టీడీపీ కార్యకర్తల పై దేశ ద్రోహం కేసులు బనాయించి వేధిస్తున్నారు. సకల శాఖా మంత్రి సజ్జల, విద్యా శాఖ మంత్రి బొత్స మిమ్మల్ని అవగాహనలేని మూర్ఖపు ముఖ్యమంత్రి, బుర్ర తక్కువ హామీలు ఇచ్చారని పబ్లిగ్గా పరువు తీస్తున్నారు. మరి వీళ్ల పై కేసులు ఉండవా ముఖ్యమంత్రి గారూ అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

follow us

సంబంధిత వార్తలు