CM Chandrababu: కెపాసిటీ బిల్డింగ్ పై చంద్రబాబు సీరియస్

CM Chandrababu: ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్ పై ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. సచివాలయంలో ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి ఉద్యోగి నుంచి సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికీ కెపాసిటీ బిల్డింగ్ కోసం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
పీ4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి ఛైర్మన్ గా 25 మందితో కూడిన జనరల్ బాడీ, దీనికి అనుబంధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎంపవర్డ్ టీమ్స్ తో స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ పై చర్చించిన చంద్రబాబు.. భారత సైన్యం చర్యకు అభినందనలు తెలిపారు.
అంతరిక్ష-రక్షణ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు రాష్ట్రంలో నెలకొల్పేలా పెట్టుబడులు ఆకర్షించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఇందుకోసం సచివాలయంలో ఇస్రో మాజీ చైర్మన్, ప్రస్తుతం రాష్ట్రానికి స్పేస్ టెక్నాలజీ అడ్వయిజర్‌గా ఉన్న ఎస్ సోమనాథ్, అలాగే మాజీ డీఆర్డీఓ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర ఏరోస్పేస్-డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డితో సీఎం చర్చించారు.
స్పేస్-డిఫెన్స్ పాలసీల రూపకల్పనతో పాటు… ఈ రెండు రంగాలకు సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు పొందేలా చురకైన పాత్ర పోషించాలని ఇరువురికి ముఖ్యమంత్రి సూచించారు.