Published On:

Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ప్రపంచ దేశాలు

Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ప్రపంచ దేశాలు

Pahalgam : జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. ఈ సమయాన తాము భారత్ తో ఉన్నట్లు తెలియజేశాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జెనరల్ అంటోనియో గుటెర్రెస్ ఈ చర్యను ( Pahalgam Terror Attack ) హేయమైనదిగా అభివర్ణించారు. అమాయకులైన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడులు చేయడం పిరికివాళ్ల లక్షణమన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వన్స్ పహల్గాం ఉగ్ర దాడిని ఖండించారు. బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు.

 

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం . ఉగ్రవాదంపై జరిపే పోరులో తాము భారత్ తో కలిసి పనిచేస్తాం. – ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యహూ

 

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి విషాదకరమైనది. భారత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలకు మా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

 

 

 

భారత్ దారుణమైన ఉగ్రదాడిలో తమ పౌరులను కోల్పోయింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం – ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్

 

పహల్గాం ఉగ్ర చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి చర్యలు బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం – ఇటలీ ప్రధాని జార్జియా మెలోని

 

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదంపై పోరులో శ్రీలంక ఎప్పడూ భారత్ కు తోడుగా ఉంటుంది.- శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ

 

జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తున్నాం. అమాయకుల ప్రాణాలు తీయడం సిగ్గుచేటు. ఈ కష్ట సమయంలో జర్మనీ భారత్ వెంట ఉంటుంది. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాం. – జర్మనీ విదేశాంగ శాఖ

 

అంతర్జాతీయ చట్టాలను దెబ్బతీసే ఉగ్రవాద చర్యలను ఖండిస్తున్నాం. – యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ