Published On:

Actress Amina Nijam: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై నటి సంచలన కామెంట్స్‌.. మండిపడుతున్న నెటిజన్స్‌!

Actress Amina Nijam: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై నటి సంచలన కామెంట్స్‌.. మండిపడుతున్న నెటిజన్స్‌!

Actress Amina Nijam Sensational Comments on Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ ఓ నటి సంచలన కామెంట్స్‌ చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తి చేస్తూ ఇండియన్‌ ఆర్మీ తీరును తప్పుబట్టింది. దీంతో ఆమెపై నెటిజన్స్‌ నెగిటివ్‌ కామెంట్స్ విరుచుకుపడుతున్నారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో తిప్పికొట్టింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 80పైగా ఉగ్రవాదులను మట్టికరిపించింది.

 

దీంతో భారత పౌరులంత మన సైనిక దళాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మేమంత మీ వెంటనే అంటూ ఆర్మీకి మద్దతు పలుకులుతున్నారు. భారత సైన్యానికి జైజైలు కొడుతూ.. భారత మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు. సాధారణ ప్రజలే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తామంతా ఆర్మీ వెంటనే అంటూ పోస్ట్స్‌ పెడుతున్నారు. అయితే కేరళకు చెందిన నటి అమీనా నిజమ్‌ మాత్రం ఈ ఆపరేషన్‌ సిందూర్‌పై అభ్యంతరం తెలిపింది.

 

ఆపరేషన్ సిందూర్ – సిగ్గుపడుతున్నా..

తన సోషల్‌ మీడియాలో ఇలా రాసుకొచ్చింది. ‘అవును.. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఇండియన్‌ ఆర్మీ పాకిస్తాన్‌లోని ప్రజలను చంపడంపై నేను సిగ్గు పడుతున్నాను. చంపడమే మార్గమా? అనే ప్రశ్నలు ఇప్పటికీ సమాధానాలు లేవు. ఇలాంటి వాటిల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. గుర్తుపెట్టుకోండి యుద్ధంతో శాంతిని తీసుకురాలేము. ఇలాంటి చర్యను నేను సపోర్టు చేయను. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటున్నామనే భ్రమలో ఉన్నారు ప్రజలంత. కానీ, యుద్ధం వల్ల నష్టపోయేది సాధారణ పౌరులు మాత్రమే. నా ప్రజల క్షేమం కోసం ఆలోచించే భారతీయురాలిని నేను, అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదానిని కాదు” అంటూ రాసుకొచ్చారు.

 

ఇక ఆమె పోస్ట్‌ చూసి నెటిజన్స్‌ అంతా ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడుతున్నారు. దేశ వ్యతిరేకి అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉగ్రవాదుల ప్రాణాల గురించి ఆలోచిస్తున్నావు.. కానీ వారి చేతిలో అమాయకులైన మన ఇండియన్స్‌ చనిపోయారనే విషయం గుర్తు చేయాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పాకిస్తాన్‌ ఉగ్రవాదులను పాపం అనడం వారిపై సానుభూతి చూపించడం ఏమాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు.