Published On:

Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ సరైన పేరు : వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ

Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ సరైన పేరు : వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ

Operation Sindoor : పాక్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన మిలిటరీ యాక్షన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ సరైన పేరు అని పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆమె ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. కేంద్రం సరైన సమయంలో చర్యలు తీసుకుందని, భవిష్యత్‌లో ఇలానే కొనసాగించి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఆమె కోరారు.

 

ఉగ్రవాదాన్ని అంతం చేసి దేశానికి శాంతి తీసుకురావాలన్న లక్ష్యంతో తన భర్త రక్షణ దళాల్లో చేరారని తెలిపారు. ఇప్పుడు తన భర్త లేకపోయినా ఆ స్ఫూర్తి మాత్రం ఉందని చెప్పారు. అమాయకుల ప్రాణాలు తీసి, వారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిన వారికి పడిన శిక్ష చూసి తన భర్త ఆత్మ శాంతించి ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని, తనలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ పేరు సరిగ్గా సరిపోయిందని ఆమె చెప్పారు. తనకు ఇటీవల వివాహం జరిగిందని, తన జీవితాన్ని వారు లాగేసుకొన్నారని చెప్పుకొచ్చారు. ఒక్క క్షణంలో తన జీవితం తల్లకిందులైందని తెలిపారు. నాతోపాటు చాలా మంది జీవితాలు దెబ్బతిన్నాయని, పురుషులు కూడా తండ్రిని, సోదరుడిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

తాను ఎంతో బాధను అనుభవిస్తున్నానో చెప్పలేనన్నారు. కానీ, ఈ చర్యతో కొంత ఊరట వచ్చిందని తెలిపారు. ఉగ్రవాదం అంతానికి ఇదే ఆరంభం కావాలన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు అమరవీరుల హోదా ఇవ్వాలని ఆమె కోరారు. ఆపరేషన్‌పై హిమాన్షీ తండ్రి సునీల్ స్వామి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులు బాధితులను వెళ్లి ప్రధాని మోదీకి చెప్పమన్నారు. ఇప్పడు మోదీజీ చెప్పారని, ప్రభుత్వం ఉగ్రవాదులకు తగిన జవాబు ఇస్తుందని తాను నా కుమార్తెకు చెప్పామన్నారు. పాకిస్థాన్‌పై దాడులను తాము స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

 

 

ఇవి కూడా చదవండి: